నేరాల అదుపునకు సాంకేతిక పరిజ్ఞానం సాయం
కై కలూరు: రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మండలంలోని పోలీసుస్టేషన్లను ఎస్పీ శనివారం తనిఖీ చేశారు. అనంతరం టౌన్ పోలీసుస్టేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నేరాల నియంత్రణలో సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నేరాల సంఖ్య తగ్గుతోందని ఇందుకు సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించడమే ప్రధాన కారణమన్నారు. కై కలూరు స్టేషన్ల పరిధిలో ఇటీవల నమోదైన కేసుల్లో సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించి కేసులను ఛేదించడం అభినందనీయమన్నారు.
తాడేపల్లిగూడెం: పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఒక ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని శనివారం విజిలెన్సు, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా చేసిన దాడిలో స్వాధీనం చేసుకున్నారు. చిన్నంశెట్టి మణికంఠ 4.50 టన్నుల రేషన్ బియ్యం నిల్వ చేసినట్టుగా సోదాల్లో గుర్తించారు. అతనిని అధికారులు ప్రశ్నించగా రేషన్ కార్దుదారుల నుంచి కిలో రూ.20కి కొనుగోలు చేసి , జంగారెడ్డిగూడెంకు చెందిన మంచాల సాయికి కిలో రూ.22 చొప్పున విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు నిల్వ ఉన్న సుమారు రూ.1.80 లక్షల విలువైన బియ్యం స్వాధీనం చేసుకుని, నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం కేసు నమోదు చేశారు. విజిలెన్సు ఎస్పీ కె.నాగేశ్వరరావు ఆదేశాల మేరకు జరిగిన ఈ దాడిలో విజిలెన్సు ఎస్‌ఐ కె.సీతారాం, గూడెం సీఎస్‌డీటి. వి.అన్నపూర్ణ, వీఆర్‌ఓ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
నేరాల అదుపునకు సాంకేతిక పరిజ్ఞానం సాయం


