ఈ ఏడాదైనా.. ఉండి సమస్యలు తీరేనా?
ప్రధాన సమస్యలు పరిష్కరించాలి
రైతులను ఆదుకోవాలి
ఉండి: చంద్రబాబు ప్రభుత్వంలో ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రజాప్రతినిధులు చేసిన వాగ్ధానాలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఉండిలోని ప్రధాన సమస్యలపై సైతం పాలకులు దృష్టి పెట్టడం లేదు. జాతీయ రహదారి 165పై ఉండి ప్రధాన సెంటర్ జంక్షన్‌లో ఉండి కాలువపై క్షీణదశకు చేరిన వంతెన ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో తరచూ వంతెనపై ట్రాఫిక్ నిలిచిపోతుంది. అంతేకాకుండా ఈ మార్గంలో విజయవాడ, గుడివాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, గణపవరం వెళ్లేందుకు భారీ వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరుకున్న వంతెన ఎక్కడ కూలిపోతుందోనని బెంబేలెత్తుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఇక్కడ వంతెన నిర్మిస్తారు అని అనుకున్నా ప్రస్తుతం జాతీయ రహదారి నిర్మాణ ప్రణాళిక మారిపోవడంతో ఇప్పుడు ఈ వంతెన నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.
ఉండి ఆక్విడెక్టు
అధ్వాన స్థితికి చేరిన ఉండి అక్విడెక్టు ఏటా రైతులను నిలువునా ముంచుతోంది. సీజన్ ఏదైనా వర్షం వస్తే చాలు వరి పంట ముంపునకు గురికావలసిందే అన్నట్లుంది పరిస్థితి. ఉండి అక్విడెక్టులో పైనుంచి ఉండి పంటకాలువ, కింది నుంచి బొండాడ మేజర్ డ్రెయిన్ ప్రవహిస్తున్నాయి. పంట కాలువ ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా బొండాడ మేజర్ డ్రెయిన్‌లో మురుగునీటి ప్రవాహనికి అక్విడెక్టు వద్ద తీవ్ర ఇబ్బంది తలెత్తుతుంది. అక్విడెక్టు వద్ద గుర్రపుడెక్క, తూడు, పెద్ద ఎత్తున చెత్తా చెదారం చేరుకుని మేటలు వేయడంతో మురుగునీరు ప్రవహానికి తీవ్ర ఆటంకం కలుగుతుంది. పూడిక తొలగింపునకు అధికారులు తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కానీ సమస్య మాత్రం అలానే ఉండిపోతుంది. రెండేళ్ల నుంచి అధికారం అనుభవిస్తున్న కూటమి నాయకులు రైతులను విస్మరించి వారి కోసం ఏదో చేశామని ప్రకటనలు గుప్పించడం గమనార్హం. అధికారులు ,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఉండి, ఎన్నార్పీ అగ్రహారం, మహదేవపట్నం, వెలివర్రు, పాములపర్రు, కోలమూరు, యండగండి, ఉప్పులూరు తదితర గ్రామాల్లోని వేలాది ఏకరాల వరిపంట ముంపుకు గురవుతుంది. ఇవే కాకుండా నియోజకవర్గంలో పలు సమస్యలు గూడు కట్టుకున్నాయి. వీటిని పరిష్కరించేందుకు అధికార పక్ష నాయకులు ఇప్పుడైనా దృష్టి సారించాలని కోరుకుంటున్నారు.
కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఉండి అక్విడెక్టు
క్షీణదశకు చేరుకున్న ఉండి వంతెన
ఎప్పుడు కూలిపోతుందోనని ఆందోళన
రైతులను ముంచుతున్న అక్విడెక్టు
ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టని ప్రజాప్రతినిధులు
నియోజకవర్గ కేంద్రం ఉండిలోని ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఉండి సెంటర్‌లోని పెద్ద వంతెన క్షీణదశకు చేరుకుంది. వంతెన నిర్మాణం త్వరగా జరగకపోతే వంతెన ఏదోరోజు కూలిపోయే ప్రమాదం ఉంది.
– పీవీఆర్‌కే ఆంజనేయరాజు, ఎంపీటీసీ వాండ్రం, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు
ప్రతిఏటా రైతులకు కన్నీళ్లు రప్పిస్తున్న ఆక్విడెక్టుపై దృష్టిసారించాలి. ఏన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అక్విడెక్టు నిర్మాణానికి ఈ ఏడాదిలైనా పూనుకోవాలి. సాధారణ వర్షానికి సైతం పంటలు మునిగిపోతున్న పరిస్థితుల్లో వెంటనే ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలి.
– గలావిల్లి ధనుంజయ, వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్ జిల్లా అధ్యక్షుడు, ఎన్నార్పీ అగ్రహారం
ఈ ఏడాదైనా.. ఉండి సమస్యలు తీరేనా?
ఈ ఏడాదైనా.. ఉండి సమస్యలు తీరేనా?
ఈ ఏడాదైనా.. ఉండి సమస్యలు తీరేనా?
ఈ ఏడాదైనా.. ఉండి సమస్యలు తీరేనా?
ఈ ఏడాదైనా.. ఉండి సమస్యలు తీరేనా?


