నడిరోడ్డుపై పడిగాపులు
జంగారెడ్డిగూడెం: మండలంలోని దేవులపల్లిలో శుక్రవారం ఆర్టీసీ బస్సు మొరాయించింది. భీమవరం డిపోకు చెందిన బస్సు జంగారెడ్డిగూడెం నుంచి భీమవరం వెళ్తున్న క్రమంలో దేవులపల్లి సమీపంలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు రోడ్డుపై మరో బస్సు కోసం ఎదురుచూడాల్సిన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. పల్లె వెలుగు బస్సులు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులతో పాటు, కండిషన్ సరిగా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
పాలకొల్లు సెంట్రల్ : మద్యానికి బానిసైన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని యాళ్లవానిగరువు పంచాయతీకి చెందిన సువ్వాడ పైడిరాజు (55) రైస్‌మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మద్యానికి అలవాటు పడిన అతను ప్రతి రోజు మద్యానికి డబ్బులు ఇవ్వాలని లేదంటే చచ్చిపోతానని కుటుంబ సభ్యులను బెదిరించేవాడు. డిసెంబర్ 31న రాత్రి పైడిరాజు నుంచి ఏదో వాసన వస్తోందని భార్య ప్రశ్నించింది. లిమ్కాలో కలుపుమందు కలుపుకుని తాగానని చెప్పడంతో వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.


