జాతీయస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో ఫార్మసీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఇరపా అమ్మాజీ కిరణ్ యోగాసన పోటీల్లో ప్రతిభ చాటారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 1 వరకు మహారాష్ట్రలో సంగమనేరు ధ్రువ గ్లోబల్ స్కూల్‌లో పోటీలలో ఐదో స్థానం సాధించారు. అమ్మాజీ రాష్ట్రస్థాయి పోటీలలో గతంలో బంగారు పతకం సాధించిదింద. అమ్మాజీ మాట్లాడుతూ యోగా మానసిక, శారీరక రుగ్మతలకు చక్కటి పరిష్కారమని, యోగా ప్రతి ఒక్కరికి జీవన విధానంగా మారాలని అన్నారు. అంతర్జాతీయ పోటీల్లో కూడా ప్రతిభను చాటి దేశానికి మంచి పేరు తీసుకువస్తానని తెలిపారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన స్వామివారి తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. తొలుత ఆలయంలో శ్రీవారు, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామివారి వాహనం క్షేత్ర వీధులకు పయనమైంది. గ్రామోత్సవం కనుల పండువగా సాగింది. అనంతరం ధనుర్మాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారి తిరువీధి సేవ రాత్రి వైభవంగా నిర్వహించారు.
జాతీయస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ


