వైజ్ఞానిక ప్రదర్శనలతో సృజనాత్మకత
వీరవాసరం: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు, నూతన ఆవిష్కరణలకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, బి.గోపిమూర్తి అన్నారు. వీరవాసరం ఎమ్మార్కే జెడ్పీ హైస్కూల్‌లో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌ను వారు ప్రారంభించారు. అలాగే మ్యాజికల్ సైన్స్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సుమారు 146 ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ చదువుతోపాటు ఇలాంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు. డీఈఓ ఈ.నారాయణ మాట్లాడుతూ జిల్లాలో 233 పాఠశాల్లో మండల స్థాయి పోటీలు నిర్వహించగా, 146 ప్రాజెక్టులు జిల్లాస్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యారన్నారు. వీరిలో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాంసుందర్, హెచ్‌ఎం జె.శ్రీనివాసరావు, డిప్యూటీ డీఈఓలు రమేష్, సత్యనారాయణ, జిల్లా సైన్స్ ఆఫీసర్ వి.పూర్ణచంద్రరావు, ఎంపీపీ వీరవల్లి దుర్గభవానీ, తహసీల్దార్ ఏవీ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


