అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ ప్రారంభం
వీరవాసరం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల 69వ స్కూల్ గేమ్స్ అండర్ 17 బాల బాలికల సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ కం సెలక్షన్స్ శుక్రవారం వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఏసీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడా పోటీలను ప్రారంభించారు. శాసనమండలి సభ్యులు కవురు శ్రీనివాస్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం పరిచయం చేసుకున్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, మానసిక ఉత్తేజం కలుగుతాయన్నారు. అనంతరం క్రీడా పోటీల నిర్వాహక కమిటీ సభ్యులను, క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయ ప్రకాష్ ఎంపీపీ వీరవల్లి దుర్గ భవాని, సర్పంచ్ చికిలే మంగతాయారు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పిఎస్‌ఎన్ మల్లేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి బీవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


