ఉచిత వైద్యానికి సర్కారు తూట్లు
రాజీ మార్గం.. రాజమార్గం
రాజీ మార్గమే.. రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. 8లో u
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు
కాళ్ల: పేదవాడికి అందించాల్సిన ఉచిత వైద్యాన్ని కూటమి ప్రభుత్వం నీరుగార్చుతుందని, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ప్రతులను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లనున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు తెలిపారు. కాళ్ల మండలం పెదఅమిరం జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నెల 15న జరిగే కార్యక్రమంలో జిల్లా కార్యాలయం నుంచి పార్టీ కేంద్రం కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి కోటి సంతకాల ప్రతులను తాడేపల్లి పార్టీ కేంద్రం కార్యాలయంలో అందజేస్తామన్నారు. పేదవాడికి అందించే ఉచిత వైద్యాన్ని ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరుతూ పేద ప్రజల మద్దతుతో కోటి సంతకాలను సేకరించి ప్రతులను జగన్మోహన్ రెడ్డి ద్వారా అందించినట్లు స్పష్టం చేశారు. జిల్లాలో నాలుగు లక్షలకు పైగా సంతకాలు పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రతులను ఈ నెల 15న పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. జిల్లా నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్తామని ఆయన చెప్పారు. సమావేశంలో పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఉండి పార్టీ ఇన్‌చార్జి పీవీఎల్ నరసింహ రాజు, భీమవరం ఇన్‌చార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు, పార్టీ నాయకులు పేరిచర్ల నరసింహరాజు, గాదిరాజు రామరాజు, కోడే యుగంధర్ పాల్గొన్నారు.


