వ్యాపారం విలవిల
న్యూస్‌రీల్
మనీ రొటేషన్‌తో నాడు కళకళ
నేడు వెలవెల
సైబర్ నేరగాళ్ల అరెస్ట్
ఆకివీడుకు చెందిన మహిళను డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి, ఆమె ఖాతాల నుంచి సుమారు రూ.93 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. 8లో u
ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షి, భీమవరం: భీమవరంలోని జువ్వలపాలెం రోడ్డు, పీపీ రోడ్డు, మల్టీఫ్లెక్స్ ఏరియా, నరసాపురంలోని స్టీమర్ రోడ్డు, తణుకులోని వేల్పూర్ రోడ్డు, రాష్ట్రపతి రోడ్డు, పాలకొల్లులోని బస్టాండ్ సెంటర్, టెంపుల్ రోడ్డు, తాడేపల్లిగూడెం కేఎన్ రోడ్డు, తాలుకా ఆఫీస్ రోడ్లు వ్యాపారాలకు పేరొందాయి. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి, రంజాన్, పెళ్లిళ్ల సీజన్లలో రెడీమేడ్, ఫ్యాన్సీ, కిరాణ, బంగారం, హోంగూడ్స్ తదితర వాటిపై రూ.2 వేల కోట్లకు పైనే వ్యాపారం జరుగుతుందని అంచనా. చిన్న వ్యాపారులు సైతం ఆయా సీజన్లకు నెల ముందే ఢిల్లీ, ముంబై, చైన్నె తదితర నగరాల నుంచి స్టాకులు పెట్టుకునేవారు. కొంతకాలంగా మార్కెట్‌లో వినియోగదారులు లేక అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. అద్దెలు కట్టలేని పరిస్థితుల్లో నష్టాలతో నడపలేక కొందరు వ్యాపారాలను మూసివేస్తుండటంతో షాపులు ఖాళీ అవుతున్నాయి. ప్రధాన సెంటర్లలో సైతం షాపుల ముందు టు–లెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరోపక్క ఉపాధి కోసం రోడ్లు పక్కన చిరు వ్యాపారాలు పెరుగుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సీజన్ మొదలుకానుండగా వ్యాపార వర్గాల్లో ఆ జోష్ కనిపించడం లేదు. జనం దగ్గర డబ్బుల్లేక మార్కెట్‌లో మనీ ట్రాన్సాక్షన్‌న్ తగ్గడం వ్యాపారాలపై ప్రభావం చూపిందని, మునుపటితో పోలిస్తే గత ఏడాది సీజన్‌లో 60 శాతం వ్యాపారం తగ్గినట్టు తాడేపల్లిగూడెం చాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన నేత ఒకరు తెలిపారు.
జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, చేయూత, రైతు భరోసా, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నేతన్న నేస్తం.. అన్ని వర్గాల వారికి మేలు చేస్తూ ప్రతీనెల ఏదొక సంక్షేమ పథకం చేతికంది మార్కెట్‌లో మనీ రొటేషన్ జరిగేది. ఉదాహరణకు 2023 జనవరి నుంచి డిసెంబరు వరకు సంక్షేమం రూపంలో రూ. 1,191 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమచేశారు. గ్రామగ్రామాన జగనన్న కాలనీల్లో రూ.1263 కోట్లతో చేపట్టిన పక్కా ఇళ్లు, రూ.260 కోట్లతో సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్ సెంటర్లు నిర్మాణాలు, నాడు–నేడులో రూ. 369 కోట్లతో పాఠశాలల అభివృద్ధి, రూ. వందల కోట్లతో జిల్లాలో ఆక్వా వర్శిటీ, మెడికల్ కళాశాల, ఆస్పత్రుల అభివృద్ధి పనులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీతో విద్య, వైద్యానికి భరోసా, మరోపక్క రియల్ ఎస్టేట్ జోరుతో భవన నిర్మాణం, అనుబంధ రంగాల్లోని కార్మికులు, వ్యాపారులకు ఏడాది పొడవునా పని దొరికి చేతినిండా డబ్బులతో వ్యాపారాలు కళకళలాడేవి.
సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది సంక్షేమాన్ని విస్మరించింది. 2025 జనవరి నుంచి డిసెంబరు వరకు ఏడాది కాలంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్ సబ్సిడీ, మత్య్సకార భృతి, వాహన సేవ పథకాల ద్వారా జిల్లా వాసులకు జమచేసింది కేవలం రూ.409 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వం చేసిన మేలులో ఇది కేవలం మూడో వంతు మాత్రమే. మరోపక్క విద్యుత్ చార్జీలు, ఇంటిపన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి.
మార్కెట్‌లో తగ్గిపోయిన మనీ రొటేషన్
బేరాల్లేక షాపులు ఖాళీ చేస్తున్న వ్యాపారులు
బిజినెస్ ఏరియాల్లోనూ షాపుల ముందు టు–లెట్ బోర్డులు
గత ప్రభుత్వంలో సంక్షేమ పరవళ్లతో వ్యాపారాల జోరు
2023లో పేదలకు చేకూరిన సంక్షేమ లబ్ధి రూ.1,191 కోట్లు
2025లో చేకూరిన లబ్ధి కేవలం రూ.409 కోట్లు
నరసాపురం–పాలకొల్లు రోడ్డులో గతంలో అక్కడక్కడ శీతల పానీయాలు, పండ్లు, కూరగాయల దుకాణాలు కనిపించేవి. కొంతకాలంగా రోడ్డుకు ఇరువైపులా దారిపొడవునా గృహోపకరణాలు, సీజనల్ పండ్లు, కాయలు తదితర చిరువ్యాపారాలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలోని భీమవరం–తణుకు, ఉండి – ఏలూరు, తణుకు–తాడేపల్లిగూడెం హైవే, తదితర రద్దీ రోడ్లలో పదుల సంఖ్యలో చిరు వ్యాపారాలు వెలుస్తున్నాయి.
వ్యాపారం విలవిల
వ్యాపారం విలవిల


