14 వరకు విర్డ్‌లో ప్రత్యేక వైద్య శిబిరం
ద్వారకాతిరుమల: స్థానిక విర్డ్ ట్రస్ట్ ఆసుపత్రిలో ఈ నెల 11న ప్రారంభమైన ప్రత్యేక వైద్య శిబిరం 14 వరకు కొనసాగుతుందని ట్రస్ట్ చైర్మన్ ఎస్‌వీ సుధాకరరావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. తొలి రోజు మొత్తం 45 మంది రోగులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, అందులో 10 మందికి శస్త్ర చికిత్సలు చేసినట్టు చెప్పారు. 13, 14న ప్రముఖ వైద్య నిపుణులు భుజం, మోకాళ్ల సమస్యలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ శిబిరంలో వైద్యులు శ్రీనాథ్, భవ్యచంద్, శ్రీనివాస్ కంభంపాటి ప్రత్యేక సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు.


