కోటి సంతకాలకు అనూహ్య స్పందన
పెనుగొండ: చంద్రబాబు సర్కారు కుట్రపూరిత నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించిందని వైఎస్సార్ సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. సోమ వారం తూర్పుపాలెంలోని కార్యాలయంలో పెను గొండ, ఆచంట, పెనుమంట్ర, పోడూరు మండలాల్లో సేకరించిన జాబితాలను పార్టీ నాయకులు మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజులకు అందించారు. ఈ సందర్భంగా శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో బడుగు, బలహీన, దళిత వర్గాలతో పాటు, అగ్రవర్ణాల్లోని పేదలకు అన్యాయం జరుగుతుందని ప్రజలు గ్రహించారన్నారు. దీంతో సంతకాలు చేయడానికి అన్నివర్గాల నుంచి మద్దతు లభించిందన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టిన 18 నెలల్లోనే రెండు వేలకు పైగా మెడికల్ సీట్లు కోల్పోయామన్నారు. దీనిని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ రాజకీయాలు చేయడం ప్రారంభించారన్నా రు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ధనికవర్గాలకే విద్య అందుబాటులో ఉంచుతున్నారని, ప్రజలంతా వ్యతిరేకించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మండల కన్వీనర్లు పిల్లి నాగన్న, జక్కంశెట్టి చంటి, నల్లిమిల్లి వేణుప్రతాపరెడ్డి(బాబీ), గూడూరి దేవేంద్రుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబూరావు, విద్యార్థి విభా గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమనంపూడి సూర్యరెడ్డి, నాయకులు వెలగల శ్రీనివాస రెడ్డి,తిక్కిరెడ్డి పవన్, కుడిపూడి సుబ్రహ్మణ్యం, గుబ్బల వీర బ్రహ్మం, పడాల అబ్బు, కర్రి వేణుబాబు, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు


