ఉద్యోగులకు నరకవేతన | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు నరకవేతన

Dec 9 2025 10:49 AM | Updated on Dec 9 2025 10:49 AM

ఉద్యో

ఉద్యోగులకు నరకవేతన

కక్షపూరిత ధోరణితో..

సిబిల్‌ స్కోర్‌ పడిపోతుంది

డిఫాల్ట్‌ అయిపోతున్నారు

చాలా దారుణం

ఏలూరు (మెట్రో)/భీమవరం (ప్రకాశం చౌక్‌ ) : గతనెల 5వ తేదీ.. ఈనెల 8 వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు జమకాలేదు. ప్రతినెలా 1వ తారీఖునే జీతాలు జమచేస్తామన్న కూటమి నాయకుల హామీ లు అమలుకావడం లేదు. నెలంతా కష్టపడినా ప్రతినెలా జీతాల కోసం ఎదురుచూడటం ప్రభుత్వ ఉద్యోగులకు పరిపాటిగా మారింది. దీంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు అవస్థలు తప్పడం లేదు.

ప్రతి నెలా నిర్లక్ష్యమే..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 67 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. ఏలూరు జిల్లా లో 38 వేలు, పశ్చిమగోదావరి జిల్లాలో 29 వేల మంది పలు శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు సుమారు 20 వేల మందికి పైగా పెన్షనర్లు ఉన్నారు. అలాగే సుమారు 15 వేల మంది అవుట్‌ సోర్సింగ్‌, 17 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతినెలా వీరికి ఒకటో తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లించాల్సి ఉంది. అయితే చంద్రబాబు సర్కారు జీతాల చెల్లింపుల్లో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

ఒక్కో శాఖకు ఒక్కోలా..

1వ తేదీన జీతాల చెల్లింపు ప్రక్రియకు చంద్రబాబు ప్రభుత్వం వక్ర భాష్యం చెబుతోంది. అవుట్‌ సోర్సింగ్‌, న్యాయశాఖ, పెన్షనర్లకు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి 1, 3వ తేదీల్లో చెల్లింపులు చేశారు. అయితే రెవెన్యూ, ఇరిగేషన్‌, జిల్లాపరిషత్‌, కో–ఆపరేటివ్‌, బీసీ వెల్ఫేర్‌, సోషల్‌ వెల్ఫేర్‌ ఉద్యోగులు, న్యాయశాఖలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానాల సిబ్బంది ఇలా పలు శాఖల ఉద్యోగులకు సోమవారం (8వ తేదీ) రాత్రి వరకూ జీతాలు జమ కాలేదు. ఒక్కోశాఖకు ఒక్కో తేదీన చెల్లింపులు చే యడం ఏమిటో ఉద్యోగులకు అర్థం కావడం లేదు.

సిబిల్‌ స్కోర్‌పై ప్రభావం

ప్రస్తుతం ప్రతి వ్యక్తికీ ఆర్థిక క్రమశిక్షణ కీలకంగా మారింది. బ్యాంకులు ఖాతాదారుల పాన్‌కార్డు ఆధారంగా సిబిల్‌ స్కోర్‌ అనేది పరిశీలిస్తున్నారు. రుణాల మంజూరు, ఈఎంఐల చెల్లింపులు, చెక్‌ బౌన్స్‌ల తదితరాల ద్వారా సిబిల్‌ స్కోర్‌ లెక్కి స్తారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు నిర్వాకంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు సిబిల్‌ స్కోర్‌ పడిపోతోంది. ఈఎంఐలకు ఇచ్చిన చెక్‌లు, రుణాల చెల్లింపులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ కావడంతో సిబిల్‌ స్కోర్‌పై ప్రభావం చూపుతుందని ఉద్యోగులు అంటున్నారు. జీతాలు జమకాక ఖాతాలు ఖాళీగా ఉండటంతో రుణాలకు సంబంధించి బ్యాంకుల్లో ఇచ్చి న చెక్కులు బౌన్స్‌ అవుతున్నాయని వాపోతున్నా రు. సంవత్సరం చివరి నెల కావడం, క్రిస్మస్‌ వంటి ప్రధాన పండుగ ఉండటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఉద్యోగులకు డీఏల చెల్లింపులు, ఇతర ప్ర యోజనాలు అందించడంలో చంద్రబాబు స ర్కారు విఫలమైంది. ఈ నేపథ్యంలో వాటిని ప్రశ్నించడానికి వీలు లేకుండా జీతాలు వస్తే చాలురా ‘బాబూ’ అనే ధోరణికి ప్రభుత్వం తీసుకొస్తోంది. ప్రతి నెలా జీతాల చెల్లింపులో ఆలస్యం కావడం, ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయంలో ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులపై కక్షపూరిత ధోరణిని ప్రభుత్వం అవలంబిస్తోందని ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి.

ఇదేం ఖర్మరా బాబూ !

8వ తేదీ వచ్చినా జీతాలు జమ కాలేదు

చరిత్రలో ఎన్నడూ లేదంటున్న ఉద్యోగ సంఘాలు

డిఫాల్టర్లుగా మారుతున్న ఉద్యోగులు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది మంది ఎదురుచూపులు

ఉద్యోగులు ప్రతి నెలా రుణాలకు ఈఎంఐలు పెట్టుకుంటారు.జీతాలు జమ చేయడంలో ఇలా ఆలస్యం చేయడంతో వారి సిబిల్‌ స్కోర్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో భవిష్యత్‌లో రు ణాలు కూడా లభించని పరిస్థితి ఉద్యోగులకు ఎదురవుతుంది. ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి.

–ఆర్‌ఎస్‌ హరనాథ్‌, పీఏఓ రాష్ట్ర అధ్యక్షుడు

రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో ఉ ద్యోగులు డిఫాల్ట్‌గా మారిపోతున్నారు. బ్యాంకులు ఉద్యోగులకు భవిష్యత్‌లో రుణాలు మంజూరు చేసే అవకాశమే లేకుండా ప్రభుత్వం చేస్తుంది. గత నెల 6 వచ్చినా జీతాలు జమ కాలేదు. ఈనెల ఇప్పటివరకూ లేవు. నా 33 ఏళ్ల ఉద్యోగ చరిత్రలో ఎన్నడూ ఇలా లేదు.

–జి.శ్రీధర్‌రాజు, జిల్లాపరిషత్‌ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు

ఈనెల 8వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు చెల్లించపోవడం దారుణం. ప్రతి నెలా జీతాల చెల్లింపులో మాత్రం ప్రభుత్వం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు రూపాల్లో ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాటి కోసం అడగకుండానే జీతాలు కోసం అడగాల్సిన పరిస్థితి.

– కె.రమేష్‌కుమార్‌, జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు

ఉద్యోగులకు నరకవేతన 1
1/3

ఉద్యోగులకు నరకవేతన

ఉద్యోగులకు నరకవేతన 2
2/3

ఉద్యోగులకు నరకవేతన

ఉద్యోగులకు నరకవేతన 3
3/3

ఉద్యోగులకు నరకవేతన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement