కక్ష సాఽధింపులను తిప్పికొడదాం
పెనుగొండ: నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులపై జరుగుతున్న కక్షసాధింపులను ఐక్యతతో తిప్పి కొడదామని వైఎస్సార్ సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పిలుపు నిచ్చారు. బుధవారం తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో సర్పంచులను, నాయకులను వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. విచారణలు, ఫిర్యాదులు పేరుతో భయపెడితే భయపడే వారు ఎవరూ లేరన్నారు. కోటి సంతకాల సేకరణలో ఆచంట నియోజకవర్గం జిల్లాలో ముందంజలో ఉందన్నారు. కక్ష సాధింపులు మాని, అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. కేవలం కక్ష సాధింపులు, డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతుందన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. నియోజవర్గ పరిశీలకుడు ఖండవల్లి వాసు, ఎంపీపీ సబ్బితి సుమంగళి, జడ్పీటీసీ కర్రి గౌరీ సుభాషిణీ వేణు బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబూరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిన్నం ఏడుకొండలు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమనంపూడి సూర్యారెడ్డి, మండల కన్వీనర్లు నల్లిమిల్లి వేణుప్రతాపరెడ్డి, జక్కంశెట్టి చంటి, పిల్లి నాగన్న, గూడూరి దేవేంద్రుడు, సర్పంచ్‌లు బుర్రా రవికుమార్, ఇళ్ల లక్ష్మీ చంద్రిక, పూర్ణిమ, ముదునూరి నాగరాజు, నాయకులు పాల్గొన్నారు.


