నేరాలు చేశారు.. చిక్కారు | - | Sakshi
Sakshi News home page

నేరాలు చేశారు.. చిక్కారు

Dec 11 2025 10:01 AM | Updated on Dec 11 2025 10:01 AM

నేరాల

నేరాలు చేశారు.. చిక్కారు

నేరాలు చేశారు.. చిక్కారు అర్ధరాత్రి అగ్నిప్రమాదం ప్రశాంతంగా టెట్‌ పరీక్ష టెట్‌పై రివ్యూ పిటీషన్‌ వేయాలి అబ్బయ్యచౌదరిని అడ్డుకున్న పోలీసులు కాలువలోకి ఒరిగిన స్కూల్‌ బస్సు పారిశుద్ధ్య నిర్వహణపై పర్యవేక్షణ చేయాలి ఉపాధ్యాయుడిపై లైంగిక వేధింపుల కేసు

న్యూస్‌రీల్‌

వైద్య విద్యను అంగట్లో పెడతారా?

వెల్లువలా సంతకాలు

పవన్‌ కల్యాణ్‌ నోరు మెదపరా?

ఏలూరు జిల్లాలో నేరాలకు పాల్పడిన దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులను నుంచి రూ.35 లక్షల సొత్తు రికవరీ చేశారు. 8లో u

షార్ట్‌ సర్క్యూట్‌తో తణుకు సజ్జాపురంలో ఓ ఇంట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన తండ్రి పిల్లలను కాపాడి బయటకు తీసుకువచ్చారు. 8లో u

గురువారం శ్రీ 11 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

భీమవరం: జిల్లాలో టెట్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌ రెడ్డి అన్నారు. భీమవరం విష్ణు కళాశాలలో టెట్‌ పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం పట్టణాల్లోని 8 పరీక్షా కేంద్రాల్లో 12,985 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉందన్నారు. ఈ నెల 21 వరకు టెట్‌ పరీక్షలు జరుగుతాయని చెప్పారు.బుధవారం జిల్లాలోని 5 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 67 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పరీక్షకు 540 మందికి 494 మంది హాజరుకాగా మధ్యాహ్నం పరీక్షకు 289 మందికి 268 మంది హాజరయ్యారన్నారు.

భీమవరం: టెట్‌ పరీక్షపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్‌ వేయాలని, విద్యా హక్కు చట్టానికి తగు సవరణలు చేయాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌ విజయరామరాజు డిమాండ్‌ చేశారు. భీమవరం యూటీఎఫ్‌ కార్యాలయం నుంచి బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. విజయరామరాజు మాట్లాడుతూ ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సుప్రీంకోర్టులో టెట్‌పై రివ్యూ పిటిషన్‌ వేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు సీహెచ్‌ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు జి.రామకృష్ణంరాజు, కె.రామకృష్ణ ప్రసాద్‌, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు జి.అబ్రహం తదితరులు పాల్గొన్నారు.

పెదవేగి: కోటి సంతకాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరిని కొంతసేపు పోలీసులు అడ్డుకున్నారు. పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని తన నివాసం నుంచి దెందులూరులో పార్టీ శ్రేణులతో కలసి ఏలూరు పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు సిద్ధమవ్వగా పెదవేగి సీఐ సీహెచ్‌ రాజశేఖర్‌ తన పోలీస్‌ సిబ్బందితో కొంతసేపు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారని అని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని రూల్‌ దెందులూరులోనే ఎందుకు అని పోలీసులను అబ్బయ్యచౌదరి ప్రశ్నించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కోటి సంతకాల సేకరణ ర్యాలీ కార్యక్రమానికి అబ్బయ్యచౌదరి తరలివెళ్లారు.

భీమవరం: భీమవరం పట్టణంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థ బస్సు బుధవారం రాత్రి అదుపు తప్పి కాలువలోకి ఒరిగిపోయింది. విద్యా సంస్థ నుంచి విద్యార్థులను తీసుకువెళుతుండగా అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో బస్సులోని విద్యార్థులు బస్సు అద్దాలు పగలకొట్టుకుని బయటపడ్డారు. ప్రమాదంలో విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): షాపులు, హోటల్స్‌, మార్కెట్‌ ప్రాంతాలలో తనిఖీలు చేపట్టి, ప్లాస్టిక్‌ నిషేధం పూర్తిస్థాయిలో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు. బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ డోర్‌ టు డోర్‌ చెత్త సేకరణ, దోమల నివారణ, పూడికతీత, ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై మున్సిపల్‌ కమిషనర్లతో గూగుల్‌ మీట్‌ ద్వారా సమీక్షించారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య లోపంపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్లాస్టిక్‌ వాడకం నిషేధంపై ప్రజల అవగాహనకు ముఖ్యమైన ప్రాంతాలలో హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు.

కుట్రలపై కోటి గర్జన

సాక్షి, భీమవరం: పేదలకు వైద్య విద్య, నాణ్యమైన వైద్యాన్ని దూరం చేసే చంద్రబాబు సర్కారు కుట్రలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ జిల్లాలో విజయవంతమైంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునందుకుని లక్షలాది మంది ప్రజలు వెల్లువలా తరలివచ్చి ఉద్యమానికి మద్దతు తెలిపారు. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడపాలని కోరుతూ సంతకాలు చేశారు. నియోజకవర్గాల నుంచి ఆ ప్రతులను వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయానికి తరలించే కార్యక్రమం బుధవారం జిల్లా అంతటా ఘనంగా జరిగింది. బాక్సుల్లో ఉంచిన ప్రతులను ప్రత్యేక వాహనాల్లో ఉంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలతో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేశారు. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడిపేలా కూటమి పెద్దల బుద్దిని మార్చాలని కోరుతూ పలుచోట్ల సంతకాల ప్రతులకు మహిళలు మంగళహారతులిచ్చి సాగనంపారు.

తణుకులో..

మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున సేకరించిన సంతకాల ప్రతులతో తణుకు నుంచి రూరల్‌, అత్తిలి మండలాల మీదుగా పెదఅమిరంలోని జిల్లా కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేల్పూరు, అత్తిలి గ్రామాల్లో మహిళలు ప్రత్యేక వాహనానికి మంగళహారతులతో స్వాగతం పలికారు. చంద్రబాబు ప్రభుత్వం బుద్ధి మారాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా 17 వైద్య కళాశాలలు తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం జగనన్‌కే దక్కుతుందన్నారు.

తాడేపల్లిగూడెంలో..

మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో సంతకాల ప్రతులను పార్టీ కార్యాలయం నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో పెంటపాడు, పిప్పర మీదుగా జిల్లా కార్యాలయానికి ర్యాలీగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పేదల సంక్షేమం పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అందుకు నిదర్శనమే వైద్యకళాశాలల ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన అన్నారు.

ఆచంటలో..

మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో పార్లమెంట్‌ అబ్జర్వర్‌ ముదునూరి మురళీకృష్ణంరాజు, ఆచంట నియోజకవర్గ పరిశీలకుడు ఖండవల్లి వాసు, భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయం నుంచి మార్టేరు మీదుగా జిల్లా కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రంగనాథరాజు మాట్లాడుతూ కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు.

భీమవరంలో..

నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో సంతకాల ప్రతులతో రాయలం నుంచి భీమవరం పాతబస్టాండ్‌ మీదుగా పెదఅమిరంలోని పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ మాట్లాడుతూ కోటి సంతకాల ఉద్యమానికి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. వెంకటరాయుడు మాట్లాడుతూ మెడికల్‌ కళాశాల ప్రవేటీకరణ వల్ల విద్యార్థులు ప్రజలకు కలిగే ఇబ్బందులను గుర్తించారన్నారు. రాష్ట్ర కార్యదర్శి పేరిచర్ల విజయనర్సింహరాజు, జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చిగురుపాటి సందీప్‌, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి గంటా రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

నరసాపురంలో..

పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ సెంటర్‌, మత్స్యపురి మీదుగా జిల్లా కార్యాలయం వరకు భారీగా ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న చంద్రబాబు సర్కార్‌ ఇప్పటికై నా కళ్లు తెరవాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బర్రే శ్రీవెంకటరమణ, పార్టీ సీజీసీ సభ్యుడు పీ.డీ రాజు, పెంట్ర వీరన్న, ఎస్‌ఈసీ సభ్యుడు పెండ్ర వీరన్న తదితరులు పాల్గొన్నారు.

పాలకొల్లులో..

నియోజకవర్గ సమన్వయకర్త గుడాల శ్రీహరిగోపాలరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి పూలపల్లి వై.జంక్షన్‌ మీదుగా జిల్లా కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా గుడాల గోపి మాట్లాడుతూ మెడికల్‌ కళాశాలల ప్రవేటీకరణ చేస్తుంటే స్థానిక మంత్రి నిమ్మల రామానాయుడు ఏం చేస్తున్నారని, ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకుంటే ప్రజల కోసం ఏం చేస్తారని ప్రశ్నించారు. పార్టీ నేతలు చెల్లెం ఆనంద ప్రకాష్‌, యడ్ల తాతాజి పాల్గొన్నారు.

ఉండిలో..

నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్‌ నరసింహరాజు ఆధ్వర్యంలో పెదఅమిరంలోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సంతకాల ప్రతుల బాక్సులను జిల్లా కార్యాలయంలో అందజేశారు.

ఈ సందర్భంగా పీవీఎల్‌ మాట్లాడుతూ తమ పిల్లల భవిష్యత్‌కు భరోసాగా కోటి సంతకాల ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముప్పిడి సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం అర్బన్‌: మండలంలోని గొల్లవానితిప్ప జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు సుధీర్‌బాబుపై భీమవరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం అతను విద్యార్థులను అసభ్యకరంగా తాకడంతో పాటు వేధించడంతో జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్‌ చేశారు. ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి

నరసాపురం: వైద్య విద్యను అంగట్లో పెట్టి పేద మధ్య తరగతి వారికి అందకుండా చేయడం హేయమైన చర్య అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గంలో సేకరించి సంతకాల ప్రతులను బుధవారం భీమవరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ర్యాలీగా వెళ్లి అందజేశారు. ఈ సందర్బంగా అంబేడ్కర్‌ సెంటర్‌లో నిర్వహించిన సభలో ముదునూరి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ హయంలో అప్పటి ముఖ్యమంత్రి వెస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్‌ కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉండే ఆసుపత్రులు ప్రజలకు చేరువగా ఉండాలని పరితపించారని చెప్పారు. 7 మెడికల్‌ కళాశాలల నిర్మాణాలు పూర్తయ్యాయని, పెండింగ్‌లో ఉన్న 10 మెడికల్‌ కళాశాలల పనులు పూర్తిచేయడం చేతకాక, అడ్డగోలుగా ప్రైవేట్‌ పరం చేస్తూ జీవో తీసుకొచ్చారన్నారు.

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

తణుకు అర్బన్‌: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయొద్దంటూ కోటి సంతకాల కార్యక్రమంలో ప్రజలు వెల్లువలా వచ్చి సంతకాలు చేశారని చంద్రబాబు సర్కారుకు దిగి రావాల్సిందేనంటూ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. తణుకులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రభుత్వం నడిపితేనే పేదలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందుతుందన్నారు. వైద్య సీట్లు సైతం ఉచితంగానే అర్హులైన పేదలందరికీ చేరువవుతాయని, ప్రైవేటుపరం అయితే లక్షలాది రూపాయిలు వెచ్చించి మెడికల్‌ సీట్లు కొనుక్కోవాల్సిందేనని ప్రజలు గ్రహించే సంతకాలు చేశారని అన్నారు. తణుకు నియోజవర్గంలో 80,235 సంతకాలు చేశారన్నారు.

మాజీ డిప్యూటీ సీఎం కొట్టు

తాడేపల్లిగూడెం అర్బన్‌: అమ్మకానికి ఆంధ్రప్రదేశ్‌.. టెండరు వేసుకోండి అన్నట్టుగా చంద్రబాబు పాలన ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు నష్టం, కష్టం కలిగితే ఎవరిౖనైనా ప్రశ్నిస్తానని రాష్ట్రమంతా ఎలుగెత్తి చెప్పిన ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నోరు మెదపడం లేదన్నారు. చట్ట సభల్లో కూర్చోవడమే గాని ప్రజల గురించి మాట్లాడరా? అని ప్రశ్నించారు. వివిధ దశల్లో ఉన్న వైద్య కళాశాలల భవనాలను నిర్మాణం పూర్తి చేయకుండా ప్రైవేటీకరణకు సిద్దపడుతున్న చంద్రబాబుకు మళ్ళీ గట్టిగా గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయవంతంగా సంతకాల సేకరణ

నియోజకవర్గాల నుంచి ర్యాలీలుగా జిల్లా కేంద్రానికి ప్రతులు

15న భీమవరంలో భారీ ర్యాలీ

అదేరోజు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి తరలింపు

నేరాలు చేశారు.. చిక్కారు 
1
1/8

నేరాలు చేశారు.. చిక్కారు

నేరాలు చేశారు.. చిక్కారు 
2
2/8

నేరాలు చేశారు.. చిక్కారు

నేరాలు చేశారు.. చిక్కారు 
3
3/8

నేరాలు చేశారు.. చిక్కారు

నేరాలు చేశారు.. చిక్కారు 
4
4/8

నేరాలు చేశారు.. చిక్కారు

నేరాలు చేశారు.. చిక్కారు 
5
5/8

నేరాలు చేశారు.. చిక్కారు

నేరాలు చేశారు.. చిక్కారు 
6
6/8

నేరాలు చేశారు.. చిక్కారు

నేరాలు చేశారు.. చిక్కారు 
7
7/8

నేరాలు చేశారు.. చిక్కారు

నేరాలు చేశారు.. చిక్కారు 
8
8/8

నేరాలు చేశారు.. చిక్కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement