స్కూల్‌ బ్యాగ్‌.. లేదు బాగు | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బ్యాగ్‌.. లేదు బాగు

Dec 13 2025 7:39 AM | Updated on Dec 13 2025 7:39 AM

స్కూల

స్కూల్‌ బ్యాగ్‌.. లేదు బాగు

నేడు నవోదయ పరీక్ష

న్యూస్‌రీల్‌

కొన్ని రోజులకే తెగిపోయాయి

నాడు నాణ్యతకు పెద్దపీట

నేడు నవోదయ పరీక్ష
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతికి ప్రవేశ పరీక్ష 11 కేంద్రాల్లో శనివారం ఉదయం 11.30 గంటల నుంచి నిర్వహించనున్నారు. 10లో u

శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం: విద్యాసంవత్సరం మధ్యలోనే స్కూల్‌ బ్యాగుల డొల్లతనం బయటపడింది. నాణ్య త లేక కొద్దికాలానికే చిరిగిపోవడం ప్రారంభించాయి. మళ్లీమళ్లీ కుట్లు వేయించుకుంటూ కొందరు విద్యార్థులు వీటినే వినియోగిస్తుండగా మరికొందరు బయటి మార్కెట్‌లో కొత్త బ్యాగులు కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటున్న పరిస్థితి. శుక్రవారం ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో పలుచోట్ల విద్యార్థులు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోని జగనన్న విద్యాకానుక బ్యాగులు వినియోగిస్తుండటం, అవి చెక్కుచెదరకుండా ఉండటం కనిపించింది. ఈ ఏడాది ఇచ్చిన బ్యాగులు చిరిగిపోవడంతో జగన్‌ మామ ఇచ్చిన బ్యాగులు తెచ్చుకుంటున్నట్టు విద్యార్థులు చెబుతుండటం గమనార్హం.

జిల్లాలో 93 వేల మంది..

2025–26కి గాను జిల్లాలోని 1,395 పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు 93,458 మంది విద్యార్థులు ఉన్నారు. సర్వశిక్షణ అభియాన్‌ ద్వారా విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్స్‌, నోట్‌ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత షూ, రెండు జతల సాక్స్‌లు, స్కూల్‌ బ్యాగు, ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు అధనంగా డిక్షనరీలతో ఒక్కో విద్యార్థికి రూ.2,300 విలువ చేసే కిట్లను ప్రభుత్వం అందజేస్తోంది. విద్యాకానుకను సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర (ఎస్‌ఆర్‌కేవీఎం)గా పేరు మార్చిన చంద్రబాబు సర్కారు విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి పూర్తిస్థాయిలో కిట్లు పంపిణీలో విఫలమైంది. జూన్‌లో స్కూల్స్‌ రీఓపెన్‌ రోజుకు బుక్స్‌ మి నహా షూలు 43 శాతం రాగా, యూనిఫాంలు 53 శాతం, బ్యాగులు 65 శాతం మాత్రమే పాఠశాలలకు చేరుకున్నాయి. కొద్దిరోజుల తర్వాత మిగిలినవి వచ్చాయి.

నాసిరకంగా బ్యాగులు

ఎస్‌ఆర్‌కేవీఎంగా విద్యార్థులకు అందజేసిన బ్యా గులు నాసిరకంగా ఉన్నాయి. ఒక్కో బ్యాగుకు దా దాపు రూ.700 చొప్పున రూ.6.54 కోట్ల వరకు ప్రజాధనం వెచ్చించినట్టు తెలుస్తోంది. నాణ్యత లేకపోవడంతో పంపిణీ చేసిన కొద్దికాలానికే చిరిగిపోవడం, జిప్పులు ఊడిపోవడం, భుజాలకు తగిలించుకునే బెల్టులు తెగిపోవడం మొదలయ్యాయి. ఈ బ్యాగుల్లో పుస్తకాలు ఎక్కడ జారిపడిపోతాయో నని భయపడాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. కొందరు పేద విద్యార్థులు తరచూ వీటిని కుట్టించుకుంటూ వినియోగిస్తుండగా మరికొందరు కొత్తవి కొనుగోలు చేసుకుంటున్నారు. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన బ్యాగులతో ఏడాది పొడవునా ఇబ్బంది ఉండేది కాదని, పూర్తికాలం మన్నేవని అంటున్నారు. ఈ ఏడాది ఇచ్చిన బ్యాగులు రెండు నెలలకే చిరిగిపోగా జగనన్న విద్యాకానుక బ్యాగులు ఇప్పటికీ చెక్కుచెదరలేదని కొందరు పిల్లలు ఇప్పటికీ వాటినే వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు.

ఏం బ్యాగున్నాయని..!

నాసిరకంగా ఎస్‌ఆర్‌కేవీఎం బ్యాగులు

జిల్లాలో 93,458 మంది విద్యార్థులకు పంపిణీ

ఇచ్చిన రెండు నెలలకే చిరిగిపోతున్న వైనం

ప్రజాధనం దుర్వినియోగం

కుట్టించుకుంటున్న కొందరు విద్యార్థులు

కొత్తవి కొనుక్కున్న మరికొందరు

నేటికీ వినియోగంలో జగనన్న విద్యాకానుక బ్యాగులు

ఈ చిత్రాన్ని గమనించారా ఈ విద్యా సంవత్సరానికిగాను సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యామిత్ర పథకం కింద ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం పంపిణీ చేసిన స్కూల్‌ బ్యాగు ఇది. ఇచ్చిన రెండు నెలలకే జిప్‌లు వదిలేసి చిరిగిపోవడంతో కుట్లు వేయించగా చివరికి ఇలా తయారయ్యాయి. తాడేపల్లిగూడెం రూరల్‌ ఎల్‌.అగ్రహారంలో ఈ బ్యాగ్‌లతో విద్యార్థులు స్కూల్‌కు వెళుతూ కనిపించారు.

ఈ చిత్రాన్ని గమనించారా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న విద్యాకానుకగా విద్యార్థులకు అందజేసిన స్కూల్‌ బ్యాగ్‌ ఇది. ఉండి ప్రభుత్వ హైస్కూల్‌కు చెందిన విద్యార్థి ఈ బ్యాగ్‌తోనే స్కూల్‌కు వస్తూ కనిపించాడు. ఆరా తీస్తే ఈ ఏడాది జూన్‌లో ఇచ్చిన బ్యాగు చిరిగిపోవడంతో ఈ బ్యాగ్‌ను వినియోగిస్తున్నట్టు చెప్పాడు. రెండేళ్ల క్రితం

అందజేసిన ఈ బ్యాగ్‌ ఇప్పటికీ చెక్కు

చెదరకుండా ఉండటం గమనార్హం.

మా అబ్బాయి ఏడో తరగతి, మా అమ్మాయి 10వ తరగతి మోగల్లు హైస్కూల్‌లో చదువుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు నాణ్యత లేవు. ఇచ్చిన కొన్ని రోజులకే పాడై తెగిపోయాయి. దీంతో మార్కెట్‌లో కొత్త బ్యాగులు కొనాల్సి వచ్చింది.

– బేతాళ యేసు, విద్యార్థుల తండ్రి, మోగల్లు

గతంలో టీడీపీ హయాంలో సగం విద్యాసంవత్సరం ముగిసినా పాఠశాలలకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు చేరక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. అప్పట్లో టెక్ట్స్‌ బుక్స్‌, యూనిఫాం, షూస్‌ మాత్రమే ఇచ్చేవారు. 2019 సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల విద్యకు పెద్దపీట వేశారు. విద్య వైపు వారిని మరింత ప్రోత్సహించే దిశగా జగనన్న విద్యాకానుకను అమలుచేశారు. గతంలో మాదిరి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, షూస్‌తో పాటు అదనంగా నోట్‌ బుక్స్‌, బెల్టు, బ్యాగు, ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు డిక్షనరీలు జోడించారు. ఏడాది పొడవునా విద్యార్థులకు ఉపయోగపడేలా నాణ్యతకు ప్రాధాన్యమిచ్చేవారు. పాఠశాలలు తెరిచిన రోజునే పూర్తిస్థాయిలో విద్యార్థులు అందరికీ విద్యాకానుక కిట్లు అందజేస్తూ వచ్చారు. బ్యాగుల నాణ్యతను అప్పట్లో స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలించడంతో అధికారులు సైతం అప్రమత్తంగా ఉండేవారు.

స్కూల్‌ బ్యాగ్‌.. లేదు బాగు 1
1/4

స్కూల్‌ బ్యాగ్‌.. లేదు బాగు

స్కూల్‌ బ్యాగ్‌.. లేదు బాగు 2
2/4

స్కూల్‌ బ్యాగ్‌.. లేదు బాగు

స్కూల్‌ బ్యాగ్‌.. లేదు బాగు 3
3/4

స్కూల్‌ బ్యాగ్‌.. లేదు బాగు

స్కూల్‌ బ్యాగ్‌.. లేదు బాగు 4
4/4

స్కూల్‌ బ్యాగ్‌.. లేదు బాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement