రకమశిక్షణకు బాలోత్సవం దోహదం
కలెక్టర్ నాగరాణి
భీమవరం: బాలల్లో క్రమశిక్షణకు బాలోత్సవాలు దోహదపడతాయని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం బాలోత్సవాలు ప్రారంభమయ్యాయి. భీమవరం బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడో ఏడాది నిర్వహిస్తున్న బాలల సంబరానికి కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్సీ గోపిమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ వినోదం, మానసిక వికాసం కోసం విద్యార్థులు బా లోత్సవాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఆటవిడుపుగా సామాజిక, సాంస్కృతిక అంశాలు, క్రమశిక్షణ, శ్రమ, దేశభక్తి, అభ్యుదయ భావాలు, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెంపొందించడంలో బాలోత్సవాలు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ బాలోత్సవాల నిర్వహణ ద్వారా బాలల్లో సత్ప్రవర్తన, సృజనాత్మకత పెంపొందుతాయన్నారు.
అలరించిన ప్రదర్శనలు
బాలోత్సవాల్లో భాగంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శాసీ్త్రయ నృత్యం బృందం, సోలో విచిత్ర వేషధారణ, ఏకపాత్రాభిన యం, జానపద నృత్యం బృందం, సోలో జానపద గీతాలు ఆలాపన సోలో, బృందం సీనియర్స్ జూనియర్స్, చిన్నపిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్సెస్, అకడమిక్ అంశాల్లో చిత్రలేఖనం, జనరల్ నాలెడ్జ్ క్విజ్, పద్యం–భావం, రైమ్స్, వ్యాసరచన, కథలు చెప్పడం, కవితారచన,క్లేతో బొమ్మలు బెస్ట్ ఫ్రం వేస్ట్, కార్టూన్స్ వేయడం, జ్ఞాపకశక్తి పరీక్షలు సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్ కేటగిరీల్లో ప్రారంభమయ్యాయి. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంతవర్మ, డీఈఓ ఈ.నారాయణ, కళాశాల డైరెక్టర్లు ఎం.జగపతిరాజు, ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, బాలోత్సవం అధ్య క్షుడు ఇందుకూరి ప్రసాదరాజు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ పట్టాభిరామయ్య, కోశాధికారి పి.సీతారామరాజు అసోసియేట్ అధ్యక్షుడు గాతల జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.
రకమశిక్షణకు బాలోత్సవం దోహదం


