ఉద్యాన వర్సిటీ తాత్కాలిక వీసీగా ధనుంజయరావు
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం తాత్కాలిక వీసీగా డాక్టర్ కె.ధనుంజయరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. యూనివర్సిటీలో డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీయల్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ గా ధనుంజయరావు పనిచేస్తున్నారు. కొత్త వీసీ నియామకం జరిగే వరకూ ఆయన ఉద్యోగంలో ఉంటారు. ఈ ఏడాది ఆగస్టు 31న వీసీగా పనిచేస్తున్న డాక్టర్ కె.గోపాల్ ఉద్యోగ విరమణ చేశారు. తర్వాత వీసీ వ్యవహారం న్యాయపరమైన వ్యాజ్యాలతో సాగింది. యూజీసీ నిబంధన లు వ్యవసాయశాఖ పరిఽధిలోని ఉద్యాన వర్సి టీ ప్రొఫెసర్లకు వర్తించకపోవడంతో, ఉద్యోగ విరమణ వయసు గడువు పొడిగించడం వంటివి హైకోర్టు ఆదేశాలతో చెల్లలేదు. దీంతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ద్వారా ప్రభుత్వానికి పంపించిన పేర్లు, న్యాయపరమైన అంశాలు తదితర వాటిని పరిశీలించిన ప్రభుత్వం తా త్కాలిక వీసీని నియమించింది. దీంతో వీసీ కుర్చీపై పీఠముడి వీడింది.
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం కలెక్టరేట్‌లో శుక్రవారం జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లతో స మీక్షించారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు రాకుండా పనిచేయాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలన్నారు. అలాగే పీజీఆర్‌ఎస్‌లో వస్తు న్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలన్నారు. వేర్వేరు జిల్లాల నుంచి వచ్చిన రిజిస్ట్రేషన్లు సక్రమంగా నిర్వహించాలన్నారు. దళారుల ప్రమే యం లేకుండా చూడాలని, కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఏలూరు (టూటౌన్): సంక్రాంతి రద్దీ దృష్ట్యా జనవరిలో అనకాపల్లి–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–అనకాపల్లి మధ్య 07041 గల రైలు ప్రతి ఆదివారం (4, 11, 18 తేదీల్లో) ప్ర త్యేక సర్వీసుగా నడుపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే అనకాపల్లి–సికింద్రాబాద్ మధ్య 07042 గల రైలు ప్రతి సోమవారం (5, 12, 19 తేదీ ల్లో) మధ్య నడుస్తుందన్నారు. ఈనెల 21న 07274 గల రైలు మచిలీపట్నం–అజ్మీర్‌కు, 07275 గల రైలు ఈనెల 28న అజ్మీర్–మచిలీపట్నంకు నడుపుతున్నట్టు పేర్కొన్నారు.
భీమవరం: జిల్లాలో ఏపీ టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) శుక్రవారం ఆరు కేంద్రాల్లో నిర్వహించగా 91.88 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. ఉదయం 640 మందికి 585 మంది, మధ్యాహ్నం 640 మందికి 591 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
ఏలూరులో 333 మంది హాజరు
భీమవరం: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఎన్నికలను స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్‌లో శుక్రవారం నిర్వహించారు. ఐవీవీ సత్యనారాయణ (డి ప్యూటీ తహసీల్దార్, నరసాపురం) జిల్లా అధ్యక్షుడిగా, మంతెన రామ్‌ప్రసాద్ రాజు (డిప్యూటీ తహసీల్దార్, ఉండి) అసోసియేట్ అధ్యక్షుడిగా, పీడీ జగన్‌మోహన్ జిల్లా సెక్రటరీగా ఎన్నిక య్యారు. వీరితోపాటు ఆర్గనైజింగ్ సెక్రటరీలు గా సీహెచ్ రవిరాజు, ఎం.మహేశ్వరరావు, ఎగ్జి క్యూటివ్ మెంబర్లను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా ఏలూరు జిల్లా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రమేష్‌కుమార్ తదితరులు వ్యవహరించారు.


