నాకౌట్ దశకు సాఫ్ట్‌బాల్ పోటీలు
వీరవాసరం : వీరవాసరం ఎంఆర్కే జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 సాఫ్ట్ బాల్ పోటీలు నాకౌట్ దశకు చేరుకున్నాయని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి పీఎస్‌ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత తెలిపారు.
రెండవ రోజు బాలికల జట్ల ఫలితాలు
విజయనగరం జిల్లా బాలికల జట్టు గుంటూరు జట్టుపై 02:01 తేడాతో, ప్రకాశం జిల్లా జట్టు విశాఖపట్నం జట్టుపై 11:01 తేడాతో, అనంతపురం జట్టు ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జట్టుపై 11:01 తేడాతో, వైఎస్సార్ కడప జట్టు శ్రీకాకుళం జట్టుపై 08:04 తేడాతో, పశ్చిమగోదావరి జిల్లా జట్టు తూర్పుగోదావరి జిల్లా జట్టుపై 02–01 తేడాతో, విజయనగరం జట్టు కృష్ణా జిల్లా జట్టుపై 04–01 తేడాతో గెలుపొందాయి.
బాలికల క్వార్టర్ ఫైనల్ ఫలితాలు
పశ్చిమగోదావరి జిల్లా జట్టు ప్రకాశం జట్టుపై 19– 09 తేడాతో , విజయనగరం జట్టు శ్రీకాకుళం జట్టుపై 12–01 తేడాతో, తూర్పుగోదావరి జిల్లా జట్టు అనంతపురం జట్టుపై 05–01 తేడాతో , కడప జట్టు గుంటూరు జట్టుపై విజయం సాధించి సెమీఫైనల్‌లోకి ప్రవేశించాయి.
బాలుర ఫలితాలు
విజయనగరం జట్టు విశాఖ జట్టుపై 03–00 తేడాతో, తూర్పుగోదావరి జిల్లా జట్టు నెల్లూరు జట్టుపై 02–00 తేడాతో, గుంటూరు జట్టు కర్నూలుపై 13–00 తేడాతో, పశ్చిమగోదావరి జిల్లా జట్టు అనంతపురం జట్టుపై 07–01 తేడాతో, కడప జట్టు కృష్ణా జిల్లా జట్టుపై 01–00 తేడాతో , విజయనగరం జట్టు చిత్తూరు జట్టుపై 05–00 తేడాతో విజయం సాధించాయి.
బాలుర క్వార్టర్ ఫైనల్ ఫలితాలు
విజయనగరం జట్టు ప్రకాశంపై, గుంటూరు జట్టు కడప జట్టుపై, పశ్చిమగోదావరి జిల్లా జట్టు విశాఖ జట్టుపై గెలిచి సెమీఫైనల్‌లోకి ప్రవేశించాయి. ఆదివారం ముగింపు కార్యక్రమం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బాల బాలికల జట్లను ఎంపిక చేయడం జరుగుతుందని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు పీఎస్‌ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాచింకి శ్రీనివాస్ తెలిపారు.


