●మంచు కురిసే వేళలో..
మెట్ట ప్రాంతంలో ఉదయం విపరీతమైన పొగ మంచు కురుస్తోంది. ఉదయం 8 గంటలకు కూడా మంచు తెరలు వీడడం లేదు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మెట్ట ప్రాంతంలో గత కొద్ది రోజులుగా చలిగాలుల తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే దిగువకు పడిపోవడం, దీనికి తోడు చల్లటి గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు వణికిపోతున్నారు. చలి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చింతలపూడిలో శనివారం ఉదయం మంచు తెరలు వీడని దృశ్యాలివి.
– చింతలపూడి
●మంచు కురిసే వేళలో..


