రైతుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా
భీమవరం: కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. బుధవారం రైతు సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో భీమవరం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో దళారులు, మిల్లర్లు చేస్తున్న మోసంతో రైతులు బస్తాకు రూ.400 పైగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు, కలిశెట్టి వెంకట్రావు, ఎం.సీతారాం ప్రసాద్, సికిలే పుష్పకుమారి తదితరులు పాల్గొన్నారు.


