కమిషనర్‌పై చర్యలు తీసుకోండి
నరసాపురం: నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్యపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ కోరారు. బుధవారం విజయవాడలో మున్సిపల్ సీఎండీ సంపత్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కమిషనర్ మున్సిపల్ యాక్ట్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కౌన్సిల్ ఆమోదం లేకుండా అభివృద్ది పనులు చేయడం, అవినీతికి పాల్పడుతున్నారని వివరించారు. ఈ నెల 6న జరిగిన కౌన్సిల్ సమావేశంలో కమిషనర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని తీర్మానించినట్లు చెప్పారు.


