రిజర్వు ఫారెస్ట్‌లో విధ్వంసం
న్యూస్‌రీల్
అటవీ శాఖ అధికారులకు తెలిసే..
శురకవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రిజర్వ్ ఫారెస్ట్‌లో పచ్చని విధ్వంసం ప్రారంభమైంది. అడ్డగోలుగా కలపను నరికి బహిరంగంగానే అక్రమ రవాణా చేశారు. అటవీ శాఖ బీట్ మీదుగానే నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు అడవి నుంచి కలప లోడుతో వస్తున్నాయి. గిరిజనులను కూలీలుగా మార్చి కొందరు గిరిజనేతరులు తెగబడిన ఈ విధ్వంసానికి అటవీశాఖా ఽఅధికారులు కూడా సహకరం అందిస్తుండటంతో 20 ఏళ్ల పైబడిన చెట్లు నేలకొరుగుతున్నాయి. పొగాకు బేరన్ క్యూరింగ్ కోసం ఈ కలపను వినియోగించడం, స్థానికంగా మార్కెట్ ఉండటంతో అక్రమార్కులు అందరికీ ఇవ్వాల్సిందిచ్చి బహిరంగంగా విక్రయిస్తున్నారు.
జిల్లాలో పోలవరం నియోజకవర్గంలో ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉంటుంది. పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల వెంబడి వేలాది ఎకరాలు అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ప్రధానంగా పోలవరంలో అభయారణ్యం ఉండగా మిగిలిన రెండు మండలాల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ప్రధానంగా కన్నాపురం రేంజ్‌లో 17 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. ఈ క్రమంలో సంక్రాంతి నుంచి పొగాకు కోతలు పూర్తయితే బ్యారన్లల్లో క్యూరింగ్ ప్రక్రియ నిర్వహిస్తుంటారు. దీనికి అత్యధికంగా మారుజాతి కలపను వినియోగిస్తుంటారు. దీంతో కొందరు గిరజనేతరులు గిరిజనులను కూలీలుగా మార్చి అటవీ ప్రాంతంలో 20 నుంచి 25 సంవత్సరాల మారుజాతి చెట్లను ఎంపిక చేసి మెషీన్లతో నేలకూల్చి కలపను అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కొక్క లోడ్ కలప రూ.4 నుంచి 6 వేల ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కన్నాపురం రిజర్వ్ ఫారెస్ట్ రేంజ్‌లో మారుజాతి, వేగిస, సండ్ర, మద్ది, బండారు తదితర రకాల కలప వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. వందేళ్ల పైబడిన వృక్షాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. ఇవి కాకుండా అటవీశాఖ ప్రతి ఏటా విత్తనాలను సీజన్‌లో చల్లుతుంటారు. హోమ్ ఫర్నీచర్‌కు ఈ కలపను వినియోగిస్తుండటంతో అధిక డిమాండ్ ఉంటుంది. భారీ వృక్షాల మానులను ఫర్నీచర్‌కు, మిగిలిన మొత్తాన్ని క్యూరింగ్‌కు వినియోగిస్తుంటారు. అదే 25 ఏళ్ల పైబడిన మానులకు మంచి డిమాండ్ కూడా ఉంది. ఈ క్రమంలో బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెంలో పొగాకు సాగు విస్తీర్ణం అధికంగా ఉంటుంది. ఒక్కొక్క బేరన్‌లో పొగాకు కాల్చడానికి 5 నుంచి 6 టన్నుల కలపను వినియోగిస్తుంటారు. ప్రతి సీజన్‌లో ఇదే తరహాలో అడవి నుంచి 500 నుంచి 800 టన్నులను అధికారకంగా నరికి విక్రయిస్తుంటారు.
ఈ నెల 8న కన్నాపురం అటవీ శాఖ రేంజ్‌లోని కోపల్లె బీట్‌లో 3 హెక్టార్లలో అడవిలో నరికేసి ఉన్న కలప చెట్లు మొదళ్లను కొట్టేసి..
అటవీ శాఖ అధికారులకు తెలిసే అక్రమ నరికివేతలు, రవాణా జరుగుతున్నాయనేది బహిరంగ రహాస్యం. ప్రధానంగా కన్నాపురం రేంజ్‌లో కన్నాపురం మెయిన్ రోడ్డు వద్దే ఫారెస్ట్ బీట్, అలాగే దొండపూడి వద్ద మరో బీట్ ఉంటుంది. నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు ఈ బీట్ల మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఒకే రోజు 40 ట్రక్కుల రిజర్వ్ ఫారెస్ట్ కలప యుద్ధ ప్రాతిపదికన తరలించారు. దీనిలో కోపల్లె బీట్ ఏరియాలో 3 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లను మెషీన్లతో నేలకూల్చి 40 ట్రక్కుల్లో తరలించినా కనీసం ఫారెస్ట్ అధికారులు తొంగిచూడని పరిస్థితి. మరోవైపు పొగాకు బేరన్లకు కలప రవాణా చేసే అక్రమార్కుల నుంచి భారీ ప్యాకేజీలు అటవీ శాఖాధికారులకు అందుతాయనే విమర్శ ఉంది. స్థానిక అధికారులు మొదలుకొని ఒక స్థాయి అధికారి వరకు అందరికీ మాముళ్లు ఉంటాయనే ఆరోపణలున్నాయి. దీంతో పొగాకు బేరన్ సీజన్ సమయంలో రెండు నెలల పాటు ఏం జరిగినా అన్నీ తెలిసి కూడా పట్టించుకోరనే అపవాదు ఉంది. కార్యాలయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ కేసులు గత సంవత్సరం నమోదు కావడం గమనార్హం.
కన్నాపురం అటవీ రేంజ్‌లో అడ్డగోలుగా కలప నరికివేత
పొగాకు బేరన్ క్యూరింగ్ పనులకు కలప అక్రమ రవాణా
ఫారెస్ట్ బీట్ మీదుగా నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు
అడ్డగోలుగా దందా కొనసాగిస్తున్న మాఫియా
అటవీశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం
రిజర్వు ఫారెస్ట్‌లో విధ్వంసం
రిజర్వు ఫారెస్ట్‌లో విధ్వంసం


