రెండో శనివారం సెలవు ప్రకటించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయులపై అదనపు పని భారం తగ్గించడానికి రెండవ శనివారం ఈ నెల 13వ తేదీన పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ఈమేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. విద్యా క్యాలెండర్ ప్రకారం 220 పనిదినాలకు మించి పనిచేసిన పాఠశాలలకు మాత్రమే ఈ సెలవును అనుమతించాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, ఫ్యాప్టో చైర్మన్ జీ.మోహన్, సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, కో–చైర్మన్ జీ. వెంకటేశ్వరరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఆర్.రవికుమార్, ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి జే.రవీంద్ర, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


