కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.26 వేలు కనీస వేతనం అందించాలి. ఈఎస్‌ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, గ్రాట్యూటీ అందించాలి. అంగన్‌వాడీలపై రాజకీయ వేధింపులను తక్షణం నిలుపుదల చేయాలి.
– డీఎన్‌వీడి ప్రసాద్,
ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ
అంగన్‌వాడీలకు భారంగా మారిన ఎఫ్‌ఆర్‌ఎస్ (ముఖ కవళికల గుర్తింపు) విధానాన్ని తక్షణం రద్దుచేయాలి. నాణ్యమైన సెల్ ఫోన్లు, నెట్ కనెక్షన్లు అందించాలి. ఇతర కారణాల వల్ల రిజిస్టర్ కాని లబ్ధిదారులకు మాన్యూవల్‌గా రేషన్ అందించేందుకు అవకాశం కల్పించాలి.
– పి.సుజాత, అధ్యక్షురాలు, ఏపీ
అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
అంగన్‌వాడీల వేతనాలను పీఆర్సీకి అనుసంధానం చేయాలి. అంగన్‌వాడీల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదు. కేంద్రంతో మాట్లాడి ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని రద్దు చేయించాలి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలి.
– పి.భారతి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
ఇటీవల గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అంగన్‌వాడీల వేతనాలు పెంపుదల చేయాలి. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. తల్లికి వందనం పథకం అంగన్‌వాడీలకు అమలు చేయాలి. మినీ సెంటర్‌లను మెయిన్‌సెంటర్‌లుగా మార్చాలి.
– టి.మాణిక్యం, కోశాధికారి, ఏపీ
అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి


