14 నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు
లేగ దూడల అందాల పోటీలు
చూడు కట్టని పశువులకు గర్భస్థ పరీక్షలు, లేగ దూడల అందాల పోటీలను గురువారం కొణితివాడ వెటర్నరీ పశువుల ఆసుపత్రి వద్ద నిర్వహించారు. 8లో u
భీమవరం (ప్రకాశంచౌక్): జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు 2025 గోడపత్రికను గురువారం కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి చేతుల మీదుగా విద్యుత్ శాఖ ఇంజనీర్లతో కలిసి ఆవిష్కరించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి మాట్లాడారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు బీఈఈ వారి సౌజన్యంతో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు మహోద్యమంగా నిర్వహించాలన్నారు. ఇంధన పరిరక్షణ ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పట్టణ, గ్రామాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లా విద్యుత్ శాఖ అధికారి పి.ఉషారాణి, విద్యుత్ శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు.
పల్ప్‌పోలియోను విజయవంతం చేయాలి
ఈనెల 21న నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖలు అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. గురువారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జిల్లా పల్స్‌పోలియో టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 1,87,204 మందికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఇందుకు 1,315 పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు.


