నేరాలు చేశారు.. పోలీసులకు చిక్కారు | - | Sakshi
Sakshi News home page

నేరాలు చేశారు.. పోలీసులకు చిక్కారు

Dec 11 2025 7:21 AM | Updated on Dec 11 2025 7:21 AM

నేరాల

నేరాలు చేశారు.. పోలీసులకు చిక్కారు

క్లుప్తంగా

12 నుంచి సాఫ్ట్‌బాల్‌ అంతర జిల్లాల టోర్నమెంట్‌

ఏలూరు టౌన్‌: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక నేరాలకు పాల్పడిన నలుగురు దొంగల ముఠాను భీమడోలు సర్కిల్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.35 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ వివరాలు వెల్లడించారు.

ద్వారకాతిరుమలలో చోరీలు

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన కనిగొళ్ళ లక్ష్మీ కాశీవిశ్వనాథం తన కుటుంబంతో అశ్వారావుపేటలోని తన చెల్లెలు ఇంటికి వెళ్లగా ఈనెల 2న తెల్లవారుజామున దొంగలు ఇంటిలో ప్రవేశించి రూ.1.70 లక్షల నగదు, రెండు కాసుల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. అదేరోజు అదే గ్రామంలోని పోలుబోయిన లక్ష్మయ్య ఇంటిలోనూ జొరబడి సుమారు 7 కాసుల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. వీటిపై ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ కేపీ శివకిషోర్‌ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ శ్రావణకుమార్‌ పర్యవేక్షణలో భీమడోలు సీఐ యూజే విల్సన్‌ ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్‌ తన సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు.

నిందితులు వీరే..

జంగారెడ్డిగూడెం డాంగే నగర్‌కు చెందిన పోలవరపు నాగదుర్గాప్రసాద్‌.. ఇతనిపై గతంలో 90 చోరీ కేసులు, 3గంజాయి కేసులు ఉన్నాయి. తాడేపల్లిగూడెం వీవర్స్‌కాలనీకి చెందిన యర్రసాని లక్ష్మణ్‌.. ఇతనిపై గతంలో 80 చోరీ కేసులు, 3 గంజాయి కేసులు ఉన్నాయి. తాడేపల్లిగూడెం రామారావుపేటకు చెందిన గుత్తుల రవికుమార్‌.. ఇతనిపై గతంలో 26 చోరీ కేసులు, 3 గంజాయి కేసులు ఉన్నాయి. ఇక ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతానికి చెందిన చోరీ సోత్తు రిసీవర్‌ విశాఖ వసంత అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరివద్ద నుంచీ రూ.22 లక్షల విలువైన 184.37 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.11 లక్షలు విలువైన మూడు కేటీఎం బైక్‌లు, ఒక బుల్లెట్‌ వాహనం, రూ. 2 లక్షల నగదు.. మొత్తంగా రూ.35 లక్షల విలువైన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ చూపిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్‌ ఉన్నారు.

చెడు వ్యసనాలకు బానిసగా మారి..

గణపవరంలో చెడు వ్యసనాలకు బానిసైన బల్లారపు శ్యాంబాబు, పోలిమాటి కృష్ణకిషోర్‌ తమ ఇంటి సమీపంలోని నక్కల కృష్ణ ఇంటిలో చోరీకి పాల్పడి బంగారు, వెండి వస్తువులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నిడమర్రు సీఐ ఎన్‌.రజనీకుమార్‌ ఆధ్వర్యంలో ఎస్సై ఏ.మణికుమార్‌ తన సిబ్బందితో కేసును దర్యాప్తు చేశారు. గణపవరం చాణక్య కాలేజీ సమీపంలో బుధవారం నిందితులు శ్యాంబాబు, కృష్ణకిషోర్‌లను అరెస్ట్‌ చేసి రూ.2.40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చోరీ సొత్తు బాధితులకు అప్పగింత

జంగారెడ్డిగూడెం: ఈ ఏడాది సెప్టెంబర్‌ 22న ఓ ఇంట్లో అర్ధరాత్రి జరిగిన దోపిడీ లక్కవరంలో కలకలం రేపింది. ఆ దొంగల ముఠాను జంగారెడ్డిగూడెం పోలీసులు పట్టుకుని బాధితులకు సొమ్ము అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. లక్కవరం గ్రామంలోని లక్ష్మీ అంజనికుమారి, రుక్కయ్య దంపతులు సెప్టెంబర్‌ 22న ఇంట్లో నిద్రిస్తుండగా, అర్ధరాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి, వారిపై దాడి చేసి, బీరువాలో ఉన్న 40 కాసుల బంగారం, 2 కిలోల వెండిని చోరీ చేశారు. ఈ కేసును అప్పటి ఇన్‌చార్జి సీఐ టి.క్రాంతికుమార్‌ దర్యాప్తు చేసి నలుగురు నిందితులు అంగడి విల్సన్‌బాబు, గజ్జెలవాసు, దేవర శ్రీరామమూర్తి, షేక్‌ బాజీను అరెస్టు చేశారు. ఇదే కేసులో మరో నిందితుడు కావేది ప్రసాద్‌ని నవంబర్‌ 12, 2025న ప్రసుత్త సీఐ ఎంవీ సుభాష్‌ అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.40 లక్షలు విలువైన బంగారు వస్తువులు, రూ.3 లక్షలు విలువైన వెండి వస్తువులు, నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్డు, రెండు కర్రలు, మోటార్‌సైకిల్‌ స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ సుస్మిత రామనాథన్‌ బాధితులకు చోరీ సొత్తు అప్పగించారు.

శ్రీవారి దేవస్థానం ఈఓ పోస్టుకు పైరవీలు

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరినోట వినిపిస్తున్న మాట.. నెక్ట్స్‌ దేవస్థానం ఈఓ ఎవరూ. ఎందుకంటే చినవెంకన్న దేవస్థానం ఈఓ సీటుకు ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి. అయితే రోజుకో అధికారి పేరు తెరమీదకు వస్తుండటంతో దీనిపై చర్చ విస్తృతంగా సాగుతోంది. వివరాల్లోకి వెళితే. ప్రస్తుతం శ్రీవారి దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి ఈనెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. అయితే ఆ పోస్టును దక్కించుకునేందుకు కొందరు అధికారులు ఇప్పటికే పైరవీలు మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరుగుతూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆ పోస్టు ఎవరిని వరిస్తుందనే దానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే తెరమీదకొచ్చిన అధికారులు ఇద్దరు, ముగ్గురు కాగా.. తెరవెనుక మరి కొందరు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అద్దయ్యకు అదృష్టం అందేనా..

ఈఓ సీటు కోసం ప్రయత్నిస్తున్న వారిలో అద్దయ్య పేరు బలంగా వినిపిస్తోంది. ఈయన గతంలో జంగారెడ్డిగూడెం ఆర్డీవోగా పనిచేశారు. ఆలయంలో కొందరు అధికారుల సహాయంతో అద్దయ్య ఇప్పటికే చురుగ్గా అడుగులు ముందుకేసినట్టు తెలుస్తోంది. గోపాలపురం ఎమ్మెల్యే సైతం అద్దయ్యను సిఫార్సు చేస్తూ దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు లేఖ పంపినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే అద్దయ్య కాకుండా వాడపల్లి దేవస్థానం ఈఓ చక్రధరరావు, మరో ఆర్డీవో సైతం ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే అన్నవరం దేవస్థానం ఈఓగా పనిచేసి మంగళవారం బదిలీ అయిన స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వీర్ల సుబ్బారావు సైతం ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇటీవల ద్వారకాతిరుమలలోని ఓ టీడీపీ నేతను కలసి, చర్చించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా దేవస్థానం చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు ఆశీస్సులు ఉన్న వారే ఈఓగా వచ్చే అవకాశం ఉందనేది బహిరంగ రహస్యం.

శ్రీవారి దేవస్థానంపైనే మక్కువ..

రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాల్లో ఈఓగా పనిచేయడానికి ఇష్టపడని అధికారులు.. ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓగా పనిచేయడానికి మక్కువ చూపుతున్నారు. దానికి కారణం.. రాజకీయ నాయకులు, అధికారుల ఒత్తిళ్లు ఇక్కడ తక్కువ. ఈఓగా ఎవరొచ్చినా దేవస్థానం సిబ్బంది తమ సహకారాన్ని పూర్తిగా అందిస్తారు. ఇతర దేవాలయాల్లో ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకు అన్నవరం, సింహాచలం, విజయవాడ దేవస్థానాలపై రాజకీయ ఒత్తిళ్లు తీవ్ర స్థాయిలో ఉంటాయి. అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పేదే శాసనం. దాంతో రాజకీయ నాయకులు చెప్పే మాట అధికారులు వినక తప్పదు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల అండదండలతో రెచ్చిపోయే కొందరు సిబ్బందిని కూడా ఈఓలు భరించక తప్పదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఒత్తిళ్లను తట్టుకుని సమర్థవంతంగా పనిచేయగలరనే పేరున్న వేండ్ర త్రినాథరావు బుధవారం అన్నవరం దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా బాధ్యతలు చేపట్టారు. నిన్న మొన్నటి వరకు ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓగా త్రినాథరావు వస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. ఇప్పటికీ కొందరు సిబ్బంది ఆయనే ఈఓగా వస్తారని అంటున్నారు. మరో పదిహేను రోజుల్లో ఈఓ ఎవరనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వీరవాసరం: ఆంధ్రప్రదేశ్‌ 69వ స్కూల్‌ గేమ్స్‌ అండర్‌ 17 బాలబాలికల సాఫ్ట్‌ బాల్‌ అంతర జిల్లాల టోర్నమెంట్‌ పోటీలు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నందు నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ అధ్యక్షుడు జుత్తిగ శ్రీనివాస్‌, కార్యదర్శులు పీఎస్‌ఎన్‌ మల్లేశ్వరరావు, బాజీంకి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పోటీల్లో ఉమ్మడి 13 జిల్లాల బాల బాలికల జట్లు నుంచి సుమారు 416 మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. వీరందరికీ భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.

జిల్లాలో నేరాలకు పాల్పడిన దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారు. ద్వారకాతిరుమలలో జరిగిన చోరీల్లో నలుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్‌ చేసి రూ.35 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నేరస్తులకు వణుకు పుట్టించేలా వీరిని భీమడోలు జంక్షన్‌ నుంచి భీమడోలు కోర్టు వరకు ద్వారకాతిరుమల పోలీసులు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో జరిగిన చోరీకి సంబంధించి నిందితులను అరెస్ట్‌ చేసి బాధితులకు సొమ్ము అప్పగించారు. గణపవరంలో మరో చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

భీమడోలు సర్కిల్‌ పరిధిలో దొంగల ముఠా అరెస్ట్‌

రూ.35 లక్షల చోరీ సొత్తు స్వాధీనం

లక్కవరంలో మరో చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌

రూ.43 లక్షల విలువైన చోరీ సొత్తు బాధితులకు అప్పగింత

నెలాఖరున రిటైర్డ్‌ కానున్న ప్రస్తుత ఈఓ మూర్తి

ఆ పోస్టు కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు

చైర్మన్‌ ఆశీస్సులు ఎవరికీ దక్కేనో..

నేరాలు చేశారు.. పోలీసులకు చిక్కారు 1
1/3

నేరాలు చేశారు.. పోలీసులకు చిక్కారు

నేరాలు చేశారు.. పోలీసులకు చిక్కారు 2
2/3

నేరాలు చేశారు.. పోలీసులకు చిక్కారు

నేరాలు చేశారు.. పోలీసులకు చిక్కారు 3
3/3

నేరాలు చేశారు.. పోలీసులకు చిక్కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement