నరసాపురం కమిషనర్ మాకొద్దు
నరసాపురం: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, కౌన్సిల్‌కు కూడా తెలియకుండా బాక్స్ టెండర్ల రూపంలో అవినీతి వ్యవహారాలు సాగిస్తున్న నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్యపై చర్యలు తీసుకోవాలని నరసాపురం మున్సి పల్ చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కోరారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ వెంకటరమణ మాట్లాడుతూ ఈనెల 6న జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు మూకుమ్మడిగా కమిషనర్ అవినీతి వ్యవహారాలను ఎండగట్టారన్నారు. అలాగే కమిషనర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ తీర్మానం చేశారని చెప్పారు. ఈ మేరకు తీర్మానం కాపీని జేసీకి అందించారు. ఈ అంశంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. చైర్‌పర్సన్‌తో పాటు వైస్ చైర్‌పర్సన్ కామన నాగిని,కౌన్సిల ర్లు కావలి రామసీత, యర్రా శ్రీను, ద్వారా ప్రసాద్, మల్లాడి శేషవేణి, అడిదల శ్యామల, వంగా శ్రీకాంత్‌కన్నా, సఖినేటిపల్లి సురేష్, సిర్రా కాంత, సోమరాజు దుర్గాభవాని ఉన్నారు.
అర్జీల స్వీకరణ
భీమవరం (ప్రకాశం చౌక్ ): భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గడువులోపు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఉండి మండల వెలివర్రుకు చెందిన కోనాల రాజీ అనే యువతి ఈనెల 6న రాత్రి నుంచి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని, 8న హైదరాబాద్ సంతోషనగర్ స్టేషన్ నుంచి పోలీసులు ఫోన్ చేసి చోరీ కేసులో జైలుకు పంపా మని తెలిపారని, విచారణ చేసి న్యాయం చేయాలని తండ్రి సురేష్, బంధువులు జేసీని కోరా రు. అలాగే నరసాపురం జిల్లా కేంద్రం చేయాలని పలు సంఘాల నాయకులు జేసీకి వినతిపత్రం సమర్పించారు.
ధాన్యం తూకాల్లో మోసాలు
ధాన్యం తూకాల్లో మోసాలు అరికట్టి రైతు సేవా కేంద్రంలో వచ్చిన తేమశాతమే ఫైనల్ చేయాలని, కొత్త గోనె సంచులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జేసీకి వినతిపత్రం అందించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
12న రక్తదాన శిబిరం
భీమవరం కలెక్టరేట్‌లో ఈనెల 12న రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు, ఉద్యోగులకు రక్తదానంపై అవగాహన కల్పించాలని జేసీ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో 2026 వార్షిక రక్తదాన శిబిరాల ఏర్పాటు వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
సరెండర్ చేస్తూ కౌన్సిల్ తీర్మానాన్ని జేసీకి అందించిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు


