డ్వాక్రా మహిళల ఆందోళన
ఆకివీడు: తమకు తెలియకుండా తమ గ్రూపుల పే రున లక్షలాది రూపాయలు కాజేసి, మోసం చేసిన యానిమేటర్‌పై చర్యలు తీసుకోవాలంటూ డ్వాక్రా మహిళలు సోమవారం స్థానిక జాతీయ రహదారిపై యూనియన్ బ్యాంక్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. 32 గ్రూపులకు చెందిన ఖాతాల్లో సుమారు రూ.62 లక్షలు విత్‌డ్రా చేసి మోసగించారని, న్యా యం చేయాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో ఎస్సై హనుమంతు నాగరాజు ఇక్కడకు వ చ్చి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నామని రీజనల్ మేనేజర్ వచ్చి విస్తృత స్థాయి లో విచారణ చేపట్టిన తర్వాత బాధితులకు ఎలా న్యాయం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఎస్సైకు బ్యాంక్ మేనేజర్ వివరించారు. ఇదే తరుణంలో స్థానిక సమతానగర్‌లోని యానిమేటర్ కూడా తమ ఖాతాల్లో సొమ్మును డ్రా చేశారని ఆరోపిస్తూ పలు సంఘాల మహిళలు బ్యాంకు వద్దకు వచ్చారు.


