అధికారి వస్తున్నారని సెంటు చల్లి..
తేతలి పశు వధ కేంద్రంపై ఫిర్యాదుల నేపథ్యంలో పొల్యూషన్ శాఖ అధికారి వస్తున్నారని తెలుసుకున్న యాజమాన్యం సెంటు చల్లించిందని బాధితులు చెబుతున్నారు. 8లో u
పేద పిల్లోడు డాక్టర్ కాకూడదనే దురుద్దేశంతో మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారు. ప్రైవేటు కాలేజీల్లో లక్షలు, కోట్లు ఫీజులుగా వసూలు చేస్తారు. ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి, సొంత భవనాలు నిర్మించుకుంటున్న తరుణంలో వాటిని అభివృద్ధి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం కుంటి సాకుతో పీపీపీకి అంటగడుతున్నారు.
– పోతురాజు , ఎన్నార్పీ అగ్రహారం, ఉండి మండలం
పేద వాళ్ల పిల్లలు డాక్టర్లు కాకూడదా? గతంలో డాక్టర్ చదవాలంటే ఇతర రాష్ట్రాలు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా జగన్ మోహన్‌రెడ్డి 17 కాలేజీల్ని స్థాపిస్తే, వాటిని అడ్డగోలుగా అమ్ముకోవాలనుకోవడం దారుణం. ప్రభుత్వమే మెడికల్ కాలీజీలు నడిపితే పేదల పిల్లలకు భవిష్యత్ ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుంది.
– పెరుమాళ్ల సుధీర్,
పెద ఉప్పరగూడెం, ఆకివీడు మండలం
పేద, మద్య తరగతి విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలంటే డబ్బుతో సీటు కొనుక్కోవాలి. చంద్రబాబు ధనార్జన కోసమే వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. జగన్ పథకాలను అమలు చేస్తే ఆయనకు పేరు వస్తుందని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు.
– తాడిపర్తి రజని, తాడేపల్లిగూడెం
ప్రభుత్వానికి పేద ప్రజలంటే ప్రేమ లేదు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం నియంతృత్వ పోకడ అవలంభిస్తుంది. ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ ప్రతిపక్షం అనుకుంటే ఎలా. ప్రభుత్వం ఏం చేసినా ప్రభుత్వానికి వత్తాసు పలకాలా?
– ఎల్.చిరంజీవి, తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం అధ్యక్షుడు, పాలకొల్లు
అధికారి వస్తున్నారని సెంటు చల్లి..
అధికారి వస్తున్నారని సెంటు చల్లి..
అధికారి వస్తున్నారని సెంటు చల్లి..


