ఉచిత వైద్యం నిర్వీర్యం
పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే వాటిని చంద్రబాబు ప్రైవేటుపరం చేసి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ వ్యతిరేకించకుండా మద్దతిస్తున్నారు.
– బొద్దాని శ్రీనివాస్, తాడేపల్లిగూడెం
వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని అందరూ ఖండిచాలి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే అవి దోపిడీ కేంద్రాలుగా మారి పేద బిడ్డల చదువకు తలుపులు మూసినట్లే. ప్రభుత్వ విధానాలను కలిసికట్టుగా తిప్పికొట్టాలి
–పేరూరి మురళీకుమార్, తణుకు
వైద్య విద్యను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి నెట్టేలా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. భవిష్యత్తులో సీట్లు లక్షల రూపాయలకు అమ్ము కుంటారు. ఈ విధానం వల్ల పేద సామాన్య, మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్యకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
– జి.అప్పలస్వామి, తణుకు
మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడిపించాలి. ప్రైవేటుపరమైతే పేద విద్యార్థులకు వైద్య విద్య భారమవుతుంది. అలాగే పేద ప్రజలకు వైద్యం కూడా భారమవుతుంది. ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకుని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను విరమించుకోవాలి.
– బి అశోక్, ఎంబిఏ, విద్యార్థి, పాలకొల్లు
ఉచిత వైద్యం నిర్వీర్యం
ఉచిత వైద్యం నిర్వీర్యం
ఉచిత వైద్యం నిర్వీర్యం


