ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు నష్టం
భీమవరం: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని, ప్రజలంతా నిలదీయాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చినమిల్లి వెంకట్రాయుడు అన్నా రు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ప్రకాశంచౌక్ సెంటర్‌లో నిర్వహించిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభించింది. చినమిల్లి నేతృత్యంలో శిబిరాన్ని ఏర్పాటుచేయగా వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు, కా ర్మికులు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసి మ ద్దతు తెలిపారు. ప్రధాన కూడలి కావడంతో ప్రయాణికులు సైతం మేముసైతం అన్నారు. ఈ సంద ర్భంగా వెంకటరాయుడు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు మాట్లాడుతూ పేద వి ద్యార్థులు సైతం వైద్యవిద్యను అభ్యసించేలా మాజీ సీఎం జగన్ గత వైఎస్సార్‌సీపీ పాలనలో 17 మెడికల్ కళాశాల నిర్మాణం ప్రారంభించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వీటిని ప్రైవేటుపరం చేసి తన అనుయాయులకు అప్పగించాలని చూస్తోందన్నా రు. ప్రైవేటీకరణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమవరం ఎంపీపీ పేరిచర్ల విజయనర్సింహరాజు, పార్టీ నాయకులు ఏఎస్ రాజు, కోడే యుగంధర్, గాదిరాజు రామరాజు, ఇంటి సత్యనారాయణ, గుంటి ప్రభు, జంగం మాణిక్యాలరావు, కనుమూరు విజయదుర్గ, భుద్రరాజు సత్య, ఎండీ వసీం, తాళ్లపూడి పరమేశ్వరరావు, పతివాడ శేషు, పెచ్చెటి ప్రసాధ్, బొత్స ధర్మా, భుద్రరాజు వర్మ తదితరులు పాల్గొన్నారు.


