లక్ష్యానికి మించి కోటి సంతకాలు
రేపు నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
సాక్షి, భీమవరం: వైద్య క ళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద రాజు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉద్యమంలో పాల్గొనడంతో లక్ష్యానికి మించి జిల్లాలో సంతకాల సేకరణ విజయవంతం అయ్యిందన్నారు. కార్యక్రమంలో భా గంగా బుధవారం సంతకాల ప్రతులతో నియో జకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి జిల్లా కేంద్రం భీమవరం పంపించాలని పార్టీ శ్రేణులను కోరారు. 15న తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాల ప్రతులను పంపే సందర్భంగా భీమవరంలో నిర్వహించే భారీ ర్యాలీకి జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సోమ వారం ప్రకటనలో ప్రసాదరాజు విజ్ఞప్తి చేశారు.
అత్తిలి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణకు పూనుకోవడం దారుణమని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనా థ్ అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా సోమవారం అత్తిలి ఎస్వీఎస్‌ఎస్ డిగ్రీ కళాశాల వద్ద శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లా డుతూ వైద్య కళాశాలలను ప్రభుత్వం నడిపితే పేదలకు వైద్య విద్య, వైద్య సేవలు అందుతాయన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ బుద్దరా తి భరణీప్రసాద్, మద్దాల బాపిరాజు, కంకటా ల సతీష్, బుడితి సుజన్‌కుమార్ పాల్గొన్నారు.
భీమవరం: స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 19 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దని, నిర్ణీత గడువులోపు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం: కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి తమను నిర్బంధించిన మున్సిపల్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని నరసాపురం ము న్సిపల్ చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, వైఎ స్సార్‌సీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. సోమ వారం నరసాపురం డీఎస్పీ జి.శ్రీవేదను కలిసి వినతిపత్రం అందించారు. వైఎస్సార్‌సీపీ పట్ట ణ అధ్యక్షుడు కామన బుజ్జి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కామన నాగిని, కౌన్సిలర్లు ఉన్నారు.
నరసాపురం: తనను కొందరు చంపుతామని బెదిరిస్తున్నారని వైఎస్సార్‌సీపీనేత చెరుకూరి సత్యవర ప్రసాదరాజు నరసాపురం ఆర్డీఓ దాసి రాజుకు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. నరసాపురం మండలంలోని సీతారామపురం సౌత్ గ్రామం, రాజులపాలెంలో నిషేధిత వా టర్ ట్యాంక్ ప్రభుత్వ పోరంబోకు స్థలంలో, ఓవర్ హెడ్ ట్యాంక్ కింద అక్రమంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించాలని తాను హై కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకువచ్చిన క్రమంలో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.
భీమవరం: జిల్లాలో ఏపీ టెట్ (ఉపాధ్యాయల అర్హత పరీక్ష)కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో టెట్ నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈనెల 10 నుంచి 21 వరకు భీమవరం విష్ణు ఇంజనీరింగ్, డీఎన్నార్ ఇంజనీరింగ్, ఎస్‌ఆర్‌కేఆర్, విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డీఎన్నార్ అటామస్ కళాశాల, నరసాపురం స్వర్ణాంధ్ర, తాడేపల్లిగూడెం వాసవి, శశి ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 12,985 మంది అభ్యర్థులు హాజరుకాను న్నారని చెప్పారు. అలాగే టెన్త్ విద్యార్థులకు వంద రోజుల కార్యాచరణ అమలు ద్వారా నూ రు శాతం ఫలితాలు సాధించాలన్నారు.
లక్ష్యానికి మించి కోటి సంతకాలు


