నరసాపురం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మృతితో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ఏఐసీసీ రాష్ట్ర కో–ఆర్డినేటర్, పంజాబ్ మాజీ ఎంపీ జస్వీర్‌సింగ్ దింపా అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా బుధవారం నరసాపురంలో ఆయన పర్యటించారు. స్థానిక సన్‌రైజ్ హోటల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో మోదీ మోసాలతో కూడిన పాలన సాగుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి పాలన కూడా ప్రజల విశ్వాసాన్ని క్రమంగా కోల్పోతుందని చెప్పారు. ఏపీతో సహా అనేక రాష్ట్రాల్లో రైతుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలో ప్రతిపక్ష పార్టీలతోనే కాకుండా, మరోవైపు ఎలక్షన్ కమిషన్‌తో కూడా పోరాడుతుందని అన్నారు. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బీజేపీకి, ప్రధాని మోదీకి సహకరిస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పాతపాటి హరికుమార్, పీసీసీ సభ్యుడు గొల్లు కృష్ణ, నరసాపురం నియోజకవర్గ కన్వీనర్ పోలిశెట్టి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.


