మెరుగైన సేవలే కెనరా బ్యాంక్ లక్ష్యం
కై కలూరు: దేశవ్యాప్తంగా వర్చువల్ విధానంలో కెనరా బ్యాంకుల ప్రారంభోత్సవాల్లో భాగంగా 10,001 బ్రాంచ్‌ను కై కలూరు మండలం ఆలపాడు లో కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి మద్దిరాల నాగరాజు (ఐఏఎస్), కెనరా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.సత్యనారాయణరాజు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆక్వా రైతులకు రుణాలు అందించడానికి బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. కెనరా బ్యాంకు సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులతో పాటు అన్నివర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కెనరా బ్యాంక్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ విజయవాడ జనరల్ మేనేజర్ సీజే విజయలక్ష్మి, భీమవరం రీజనల్ హెడ్ ఎం.మాధవరావు, ఆలపాడు బ్రాంచి హెడ్ ఆర్.రాజేంద్రప్రసాద్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


