కామిరెడ్డి నానీకి బెయిల్ మంజూరు
దెందులూరు: వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నానికి బుధవారం రాష్ట్ర హైకోర్టు షరతులతో కూడిన యాంటిస్పేటరీ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కామిరెడ్డి నాని మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి 55 రోజుల పాటు తనను ఇబ్బంది పెట్టారని, ఈ రోజు న్యాయం గెలిచిందని అన్నారు. తన కష్టాల్లో వెన్నంటి ఉంటూ పూర్తి సహాయ సహకారాలు, మనోధైర్యాన్ని ఇచ్చిన పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి వెంకట సునీల్, పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులకు, న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్‌కు రుణపడి ఉంటానన్నారు.


