హడలెత్తించిన మోంథా
న్యూస్‌రీల్
కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవీ..
87907 31315
98497 12358
నేడు విద్యాసంస్థలకు సెలవు
బుధవారం శ్రీ 29 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
పెనుగొండ: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈదురుగాలుల బీభత్సం అధికంగా ఉండడంతో రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. లంక గ్రామాల్లో ప్రజలు పరిస్థితులకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువులకు, ఇతర ప్రాణులకు ఇబ్బందులు లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): మోంథా తుపానును ఎదుర్కొనేందుకు అధికారులందరూ 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, కలెక్టర్ చదలవాడ నాగరాణిలతో కలసి కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బియ్యపుతిప్ప, వేములదీవి గ్రామాలకు చెందిన ప్రజలను అవసరమైతే నరసాపురం పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చెప్పారు. ఈదురు గాలుల వల్ల కరెంటు తీగలు తెగిపోవడం ద్వారా ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవా లని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.
చింతలపూడి : మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో మంగళవారం అధికారులు 1200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు నెలలుగా పడుతున్న భారీ వర్షాలకు తమ్మిలేరు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. తమ్మిలేరు ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 347.45 అడుగులకు చేరుకుందని తమ్మిలేరు ఇరిగేషన్ ఏఈ లాజరుబాబు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 100 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోందన్నారు. ప్రాజెక్టులో 350 అడుగుల వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చనని అధికారులు చెప్పారు. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు డీఈ తెలిపారు.
సాక్షి, భీమవరం: మోంథా తుపాను జిల్లాపై విరుచుకుపడింది. తీరానికి చేరువయ్యేకొద్దీ బలమైన గాలులతో, ఎడతెరిపిలేని వర్షాలతో జిల్లా వాసులను వణికించింది. ఈదురు గాలుల తీవ్రతకు చెట్లు, విద్యుత్ స్తంభాలతో పాటు పలుచోట్ల భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం తీవ్ర తుపానుగా బలపడిన తర్వాత నుంచి మోంథా విశ్వరూపం చూపించింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి అలలు ఎగసిపడుతూ నరసాపురం రూరల్ చినమైనివాలంక నుంచి పెదమైనివానిలంక వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవునా సముద్రం అర కిలోమీటరు మేర ముందుకు చొచ్చుకువచ్చింది.
ఈదురుగాలులకు విరిగిన చెట్లు,
విద్యుత్ స్తంభాలు..
గాలుల తీవ్రతకు నరసాపురం రూరల్ రాజుల్లంక, సారవ, ఎల్‌బీ చర్ల, లక్ష్మణేశ్వరం, సీతారాంపురం, తూర్పుతాళ్లు, వీరవాసరం మండలంలో మత్స్యపురి, బలుసుకుయ్యలపాలెం, రాయకుదురు, నవుడూరు, అండలూరు, పాలకొల్లు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి. పాలకొల్లు వీరావారివీధి, యలమంచిలి మండలం మేడపాడు, పెనుమంట్ర మండలం పొలమూరు, ఆలమూరు, వెలగలేరు, కొయ్యేటిపాడు, బ్రాహ్మణచెరువు, పెనుగొండ మండలం ఇలపర్రు, తణుకులోని పిండిమరల వారి వీధి, వెంకటరాయపురం, పెంటపాడు మండలం ముదునూరు తదితర గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. హోర్డింగులు, ఫ్లెక్సీలు ఎగిరిపడ్డాయి. రోడ్లపై చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఉదయం నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తెరిపివ్వని వర్షం
తుపాను ప్రభావంతో రెండు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల సమయానికి జిల్లాలో 583 మిల్లీమీటర్ల వర్షం కురవగా 20 మండలాల్లో సగటు వర్షపాతం 29.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల సమయానికి 116, మూడు గంటల సమయానికి 130 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆచంట, నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు తదితర చోట్ల అధిక వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు నీటమునిగాయి.
అప్రమత్తంగా...
జిల్లా యంత్రాంగం తాడేపల్లిగూడెంలో 3, నరసాపురంలో 30, భీమవరం డివిజన్‌లో 3 ముంపు ప్రాంతాలు, 10 తీవ్ర ప్రభావిత గ్రామాలను గుర్తించారు. తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆర్‌అండ్‌బీ పరిధిలో 28, రవాణా శాఖ పరిధిలో 40 చొప్పన మొత్తం 69 జేసీబీలు, 79 పవర్ సాలను, 96 డీజిల్ జనరేటర్లను అందుబాటులో ఉంచారు. నరసాపురంలో 34 మంది సభ్యులతో ఒక ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని, ఏపీఎస్‌పీ ప్లటూన్ ఒకటి భీమవరంలో, మరొకటి నరసాపురంలో సిద్ధంగా ఉంచారు. గ్రేహౌండ్స్‌కు చెందిన 60 మంది సిబ్బందిని ఉండిలో మోహరించారు. 150 వరకు వైర్‌లెస్ సెట్లు, ఒక శాటిలైట్ ఫోను, ఒక డ్రోను అందుబాటులో ఉంచారు.
భీమవరం ప్రాంతంలో వర్షాలతో నేలనంటిన వరి పంట
నరసాపురం : 12వ వార్డులో కూలిన భారీ వృక్షం
తుపాను పరిస్థితులు చక్కబడే వరకు కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేస్తాయని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజలు ఏదైనా అత్యవసర సమాచారాన్ని తెలియజేయడానికి, సహకారాన్ని పొందడానికి కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టరేట్‌లో
కంట్రోల్ రూమ్ నంబర్
08816 299219
భీమవరం
ఆర్డీవో కార్యాలయం
98484 13739
నరసాపురం
ఆర్టీవో కార్యాలయం
93911 85874
తాడేపల్లిగూడెం
ఆర్డీవో కార్యాలయం
93817 01036
జిల్లా అంతటా ఈదురుగాలులతో కూడిన వర్షాలు
నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
3581 ఎకరాల్లో నేలనంటిన వరి పైర్లు
నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
పునరావాస కేంద్రాలను పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నేతలు
బాధితులకు వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ..
మోంథా తుపాను బాధితులను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ప్రభుత్వాన్ని కోరారు. తీరప్రాంత గ్రామాల ప్రజల కోసం నరసాపురం, మొగల్తూరు మండలాల్లో ఏర్పాటుచేసిన పలు పునరావాస కేంద్రాలను మంగళవారం ఆయన సందర్శించారు. అక్కడి ఏర్పాట్లపై స్థానికులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు తుపాను బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని ప్రసాదరాజు తెలిపారు.
పునరావాస కేంద్రాలకు 4,150 మంది తరలింపు
జిల్లాలోని నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం డివిజన్ల పరిధిలో 44 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయగా 37 కేంద్రాలను వినియోగంలోకి తెచ్చారు. ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి 9,409 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్ణయించగా, మంగళవారం సాయంత్రానికి 4,150 మందిని మాత్రమే తరలించారు. ఆయా కేంద్రాలను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, తుపాను పర్యవేక్షణ జిల్లా ప్రత్యేకాధికారి వి.ప్రసన్నవెంకటేష్, కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు.
భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ నాగరాణి సెలవును ప్రకటించారు. ఉత్తర్వులను అన్ని విద్యాసంస్థలూ తూచ తప్పకుండా పాటించాలని ఆదేశించారు. పిల్లలు బయట తిరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.
3581 ఎకరాల్లో పంట నష్టం
తుపాను ప్రభావంతో మంగళవారం నాటికి జిల్లాలోని 3581 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈదురుగాలులతో ఇరగవరం, పెంటపాడు, తాడేపల్లిగూడెం రూరల్, కాళ్ల, ఆకివీడు, వీరవాసరం, పాలకోడేరు తదితర మండలాల్లో వేల ఎకరాల్లోని వరిపైరు నేలనంటింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉప్పుటేరు, యనమదుర్రు, ఎర్రకాలువ, చినకాపవరం, గునిపూడి సౌత్, బక్లెస్, కాజ తదితర డ్రెయిన్లు, పంట కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ముంపునీరు బయటకు పోయేదారి లేక పొలాలు నీట మునిగాయి. మరో పది రోజుల్లో కోతకు రానున్న పంట కళ్లముందే నీట మునిగిపోయిందని రైతులు వాపోతున్నారు.
హడలెత్తించిన మోంథా
హడలెత్తించిన మోంథా
హడలెత్తించిన మోంథా
హడలెత్తించిన మోంథా
హడలెత్తించిన మోంథా
హడలెత్తించిన మోంథా
హడలెత్తించిన మోంథా
హడలెత్తించిన మోంథా
హడలెత్తించిన మోంథా
హడలెత్తించిన మోంథా


