పారా షూటింగ్‌లో సిల్వర్ మెడల్
అత్తిలి: పారా షూటింగ్‌లో అత్తిలికి చెందిన యడ్లపల్లి సూర్యనారాయణ సిల్వర్ మెడల్ సాధించినట్టు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి వి రామస్వామి ప్రకటనలో తెలిపారు. విజయవాడ ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్ వారి సహకారంతో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 4వ రాష్ట్ర పారా షూటింగ్ చాపియన్ షిప్ –2025లో ఎస్‌హెచ్ – సిట్టింగ్ విభాగంలో సూర్యనారాయణ ఈ ప్రతిభ సాధించారన్నారు. షూటింగ్ అకాడమీ డైరెక్టర్, చీఫ్ కోచ్ ఎన్.సుబ్రహ్మణ్యశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు కె.దయానంద్ చేతుల మీదుగా సూర్యనారాయణ మెమొంటో, సర్టిఫికెట్ అందుకున్నారు. పారా స్పోర్ట్స్‌లో దివ్యాంగులు ఉన్నతస్థాయికి చేరుకునేలా కృషి చేస్తున్న రాష్ట్ర గ్రంథాలయాల శాఖా చైర్మన్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అఫ్ అంద్రప్రదేశ్ అధ్యక్షుడు గోనుకుంట్ల కోటేశ్వరరావు, కార్యదర్శి రామస్వామికి సూర్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.


