ఉమ్మడి జిల్లా ఆర్చరీ ఎంపికలు
భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్చరీ సెలక్షన్స్ భీమవరం వంశీకృష్ణనగర్‌లోని వోల్గా ఆర్చరీ అకాడమీలో ఆదివారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్.జయరాజు, కోచ్ ఈ.సాహిత్ పర్యవేక్షణలో జిల్లా స్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ఎంపికలు జరిగాయి. సబ్ జూనియర్ విభాగంలో సబ్‌జూనియర్ కాంపౌండ్ గర్‌ల్స్ విభాగంలో ఎం.సూర్యహంసిని, వి.స్ఫూర్తి, కె.సుష్మిత, కె.హేమశ్రీ, ఎ.కనిష్క, వి.శ్రద్ధ ఎంపికయ్యారు. రికర్వ్ బాలికల విభాగంలో ఎన్.హంసిని, ఇండియన్ రౌండ్ బాయ్స్ విభాగంలో సీహెచ్ హర్షద్, వి.వివేక్, పి.రిత్విక్ జై ఎంపికయ్యారు. ఎంపికై న ఆర్చర్లు నవంబర్ 1 నుంచి విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
ఏలూరు (మెట్రో): తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో ముందస్తు ఏర్పాట్లను సమీక్షించేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాందెండ్ల మనోహర్ నేడు జిల్లాకు రానున్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సందర్శించి, తుపాను తీవ్రత, ప్రభావం, జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించనున్నారు.


