వరిని ముంచేసిన మోంథా | - | Sakshi
Sakshi News home page

వరిని ముంచేసిన మోంథా

Oct 30 2025 10:13 AM | Updated on Oct 30 2025 10:13 AM

వరిని

వరిని ముంచేసిన మోంథా

కొల్లేరులో కల్లోలం ప్రమాదకర స్థాయిలో వయ్యేరు విద్యుత్‌ శాఖకు రూ.10.47 కోట్ల నష్టం స్వల్పంగా పెరిగిన వర్జీనియా ధర

న్యూస్‌రీల్‌

నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

కొల్లేరులో కల్లోలం
కొల్లేరు ఉగ్రరూపం దాల్చుతోంది. మోంథా తుపాను ప్రభావానికి ఎగువ నుంచి చేరిన వర్షపు నీటితో కొల్లేరు సరస్సు నిండుకుండలా మారింది. 8లో u

గురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం: కంటిమీద కునుకులేకుండా చేసిన మోంథా కథ ముగిసింది. బలమైన గాలులు, భారీ వర్షాలతో విరుచుకు పడుతుందంటూ అధికారుల హెచ్చరికలు, ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ముందస్తు సన్నద్ధతతో నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. కొద్దిపాటి బలమైన గాలులు, మోస్తరు వర్షాలతో తీరాన్ని దాటడంతో జిల్లా వాసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలులతో వరి పంటకు భారీ నష్టం వాటిల్లింది. మోంథా తుఫాను ప్రభావంతో 10,309 ఎకరాల్లో పంట నీట మునగగా, ఈదురుగాలులు ధాటికి 16,072 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. వర్షాల దెబ్బకు మిగిలిన చేలలో పంట దిగుబడి తగ్గవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టం తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో ఆక్వా చెరువుల్లోకి సముద్రపు నీరు చేరడంతో గట్లు ఏకమై పంట నష్టపోయారు. ఈదురు గాలుల ధాటికి జిల్లాలో 174 విద్యుత్‌ స్తంభాలు నేలకొరగగా.. జిల్లా వ్యాప్తంగా 93 ఇళ్లు దెబ్బతిన్నాయి.

దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం

పశ్చిమ గోదావరి జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు చేస్తున్నారు. అధికశాతం విస్తీర్ణంలో పంట పాలు పోసుకునే దశ నుంచి గింజ గట్టిపడే దశలో ఉంది. ముందుగా నాట్లు వేసిన తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఇప్పటికే కోతలు మొదలయ్యాయి. మోంథా తుఫాను ప్రభావంతో 10,309 ఎకరాల్లో పంట నీట మునిగింది. అలాగే ఈదురుగాలులు ధాటికి 16,072 ఎకరాల్లో వరి పంట నేలవాలిందని ప్రాథమికంగా గుర్తించారు. అత్యధికంగా భీమవరం మండలంలో 3,297 ఎకరాలు, కాళ్ల మండలంలో 2087, నరసాపురంలో 1950, ఆకివీడులో 1250 ఎకరాలు నీట మునిగింది. పెంటపాడు మండలంలో 2,244 ఎకరాల్లో పంట నేలనంటగా, తాడేపల్లిగూడెంలో 1825, అత్తిలిలో 1550, పెనుగొండలో 1390, పాలకొల్లులో 1035 ఎకరాల్లో పంట నేలకొరిగింది. పొలాల్లోని ముంపు నీరు లాగితే ఈ నష్టం మరింత పెరుగుతుందని రైతులు అంటున్నారు. ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడులు పెట్టామని, ప్రస్తుత పరిస్థితితో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కీలక దశలో మోంథా తుపాను తమను నిండా ముంచిందని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.

1,200 ఎకరాల్లో ఆక్వాకు నష్టం

మరోపక్క నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 1,200 ఎకరాల్లో ఆక్వా పంటకు నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. పెదమైనివానిలంక, చినమైనివానిలంక, బియ్యపుతిప్ప గ్రామాల్లో నల్లి క్రీక్‌కు చేర్చి ఉన్న చెరువుల్లో ఆక్వా చెరువులు సముద్రపు ఆటుపోట్లకు గురై గట్లు తెగి ముంపు బారిన పడ్డాయి. చేపలు, రొయ్యలు గండ్లు గుండా వెళ్లిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని ఆక్వా రైతులు వాపోతున్నారు. చలిగాలుల ప్రభావంతో చెరువుల్లో ఆక్సిజన్‌ లెవల్స్‌ 3.4 పీపీఎంకు పడిపోతుండటం రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. సరిపడా ఆక్సిజన్‌ లెవల్స్‌ పెంచుకునేందుకు ఏరియర్స్‌ తిప్పడం, అవసరమైన మందుల వినియోగానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం

మరోవైపు మూడు రోజులుగా అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టించిన మోంథా తుపాను మంగళవారం రాత్రి జిల్లా మీదుగానే తీరదాటింది. ఆ సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు ఆందోళనకు గురిచేశాయి. విండ్‌ షీర్‌ ప్రభావంతో పెద్దగా ప్రభావం చూపకపోవడం ఊరటనిచ్చింది. మంగళవారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కొద్దిపాటి బలమైన గాలులతో జల్లులు పడ్డాయి. ఉదయం తొమ్మిది గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 26 సెం.మీ వర్షం కురవగా 1.3 సెం.మీ సగటు వర్షపాతం మాత్రమే నమోదైంది. అత్యధికంగా ఆచంట మండలంలో 2.3 సెం.మీ వర్షం కురవగా నరసాపురంలో 2.2 సెం.మీ, అత్యల్పంగా పాలకోడేరులో 4.8 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. మిగిలిన మండలాల్లో 1.5 సెం.మీ లోపు వర్షం మాత్రమే కురవడం గమనార్హం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై ఉన్నా వర్షం కురవకపోవడం, గాలుల తీవ్రత లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.

ఎలాంటి ప్రాణ నష్టం లేదు

భీమవరం(ప్రకాశం చౌక్‌): తుపాను కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రాణ, పశు నష్టం జరగలేదని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. భీమవరం మండలం తోకతిప్పలో రోడ్లపై రెండు అడుగుల మేర, నరసాపురం మండలం బియ్యపుతిప్పలో ఒక అడుగు మేర వర్షపు నీరు నిలిచిందన్నారు. 93 ఇళ్లు, 174 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నాయన్నారు. ఈదురు గాలుల కారణంగా 662 చెట్లు నేలకొరిగాయన్నారు. చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. బుధవారం కలెక్టర్‌ తుపాను కంట్రోల్‌ రూమును సందర్శించి కాల్స్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

తణుకు అర్బన్‌: తణుకు మండలం దువ్వ గ్రామ పరిధిలో ప్రవహిస్తున్న యనమదుర్రు కాలువ (వయ్యేరు) ఉధృతంగా ప్రవహిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కాలువలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో దువ్వలో కాలువ పరీవాహక ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ఒకపక్క తుపాను భయంతోపాటు మరోపక్క కాలువ నీటి ప్రవాహం సాధారణం కన్నా అధికంగా ప్రవహిస్తుండడంతో ఏ సమయాన ఏం జరుగుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు సంబంధించి కొంగువారిగూడెం ప్రాజెక్టు నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదలడంతో దువ్వ రెగ్యులేటర్‌ వద్ద మంగళవారం నాటికి 7 మీటర్ల ఎత్తుకు చేరుకోగా బుధవారం 7.2 మీటర్ల ఎత్తుకు చేరింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరిన్ని క్యూసెక్కుల నీటిని కిందికి వదిలి అవకాశం ఉంది. కాలువ పొడవునా ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రవాహం గట్టుపై గుడిసెలు వద్దకు చేరింది. గుడిసెల్లో నివసిస్తున్న సుమారు 15 కుటుంబాలు వయ్యేరు నీటిలోనే జీవనం సాగిస్తున్నారు.

విశాఖ సిటీ: మోంథా తుపాను ప్రభావంతో ఏపీఈపీడీసీఎల్‌కు రూ.10.47 కోట్లు నష్టం సంభవించింది. అధికారులు విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేపడుతున్నారు. 7,973 మంది విద్యుత్‌ సిబ్బందితో 523 బృందాలుగా నిరంతరం శ్రమిస్తున్నారు. ఎక్కువ నష్టం జరిగిన కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి సర్కిళ్లలో ఇప్పటివరకు 13,56,415 సర్వీసు కనెక్షన్లకు గాను 13,02,948 పునరుద్ధరించారు. 33 కేవీ సబ్‌స్టేషన్లు 255, 33 కేవీ ఫీడర్లు 192, 11 కేవీ ఫీడర్లు 1,147కి 1,125, 33 కేవీ లైన్లు 5.43 కిలోమీటర్లకు 4.43, 11 కేవీ లైన్లు 76.1 కిలోమీటర్లకు 43.7, ఎల్‌టీ లైన్లు 45.6 కిలోమీటర్లకు 29.8, 33 కేవీ స్తంభాలు 47కి 46, 11 కేవీ స్తంభాలు 1,128కి 806, ఎల్‌టీ స్తంభాలు 1,226కి 703 సిద్ధం చేశారు. డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు 25,719కి 9,367, వ్యవసాయ సర్వీసు కనెక్షన్లు 17,700కు 16,822 సర్వీసులను పునరుద్ధరించారు. గురువారం నాటికి విద్యుత్‌ పునరుద్ధరణ పనులు పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. దెబ్బతిన్న విద్యుత్తు సరఫరా వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌ ఇమ్మడి పేర్కొన్నారు. విద్యుత్‌ అంతరాయాలకు సంబంధించిన సమాచారాన్ని టోల్‌ ఫ్రీ నెం.1912కు, కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెంబర్లు నరసాపురం 7382050943, నరసాపురం 9490610151, భీమవరం 9490610143, సంబంధిత సెక్షన్‌ కార్యాలయాలకు తెలియజేసి పరిష్కారం పొందవచ్చని సూచించారు.

జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకు ధర పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు ధర పెరిగింది. మంగళవారం ధర రూ.455 ఉండగా.. బుధవారం మరో రూపాయి పెరిగి రూ.456కు చేరింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఎన్‌ఎల్‌ఎస్‌ ఏరియాలో ఐదు వేలం కేంద్రాల్లో నమోదైన ధరలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాలతో పాటు కొయ్యలగూడెం వేలం కేంద్రంలో అత్యధికంగా కేజీ ఒక్కింటికి రూ.456 లభించింది. గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల్లో రూ.455 లభించింది. లోగ్రేడ్‌ పొగాకుకు మాత్రం సరైన ధర లభించడం లేదు. లోగ్రేడ్‌ పొగాకు బుధవారం కేజీ ఒక్కింటికి రూ.50 మాత్రమే లభించింది. ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో ఇప్పటి వరకు సరాసరి ధర కేజీ ఒక్కింటికి రూ.305.01 లభించింది.

వీరవాసరం మండలం అండలూరులో కూలిన తాటాకిల్లు గోడ

ఈదురు గాలుల ధాటికి జిల్లా వ్యాప్తంగా 174 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. అత్యధికంగా యలమంచిలి మండలంలో 25, మొగల్తూరు 23, పెనుగొండ 24, పోడూరు 33, గణపవరం 18, ఉండి 10 విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. తుపాను ధాటికి జిల్లాలో 662 చెట్లు పడిపోయినట్టు అధికారులు గుర్తించారు. నరసాపురంలో 139, యలమంచిలిలో 95, పెనుగొండలో 84, మొగల్తూరు 67, గణపవరం 22, కాళ్ల 35, ఆచంట 44, భీమవరం 15 చెట్లు నేలకొరిగాయి. జిల్లా వ్యాప్తంగా 93 ఇళ్లకు నష్టం వాటిల్లగా మొగల్తూరు మండలంలో 29, నరసాపురంలో 21, పోడూరులో 15, వీరవాసరం 7, పెనుగొండ 5, ఆకివీడు 3 ఇళ్లకు నష్టం వాటిల్లింది. బియ్యపుతిప్ప, తోకతిప్ప గ్రామాల్లో రోడ్లపై 2 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. నల్లి క్రీక్‌పై శిథిలావస్థకు చేరిన వంతెన పూర్తిగా తెగిపోవడంతో నరసాపురం రూరల్‌ చినమైనలంక బీచ్‌కు వెళ్లేమార్గానికి రాకపోకలు నిలిచిపోయాయి. భీమవరం అర్బనన్‌లో 2, నరసాపురం రూరల్‌ మండలంలో ఒక ప్రాంతాన్ని ముంపు బారినపడినట్లు గుర్తించారు.

నేలకొరిగిన పంట చేలు

నష్టం తీవ్రత మరింత పెరిగే అవకాశం

గట్లు ఏకమైన ఆక్వా చెరువులు

జిల్లా మీదుగా తీరం దాటే సమయంలో మోస్తరు ప్రభావం

నష్టం లెక్కించే పనిలో అధికారులు

వరిని ముంచేసిన మోంథా 1
1/7

వరిని ముంచేసిన మోంథా

వరిని ముంచేసిన మోంథా 2
2/7

వరిని ముంచేసిన మోంథా

వరిని ముంచేసిన మోంథా 3
3/7

వరిని ముంచేసిన మోంథా

వరిని ముంచేసిన మోంథా 4
4/7

వరిని ముంచేసిన మోంథా

వరిని ముంచేసిన మోంథా 5
5/7

వరిని ముంచేసిన మోంథా

వరిని ముంచేసిన మోంథా 6
6/7

వరిని ముంచేసిన మోంథా

వరిని ముంచేసిన మోంథా 7
7/7

వరిని ముంచేసిన మోంథా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement