
రాష్ట్రంలో ఏరులై పారుతున్న నకిలీ మద్యం
● సీబీఐ దర్యాప్తు జరిపించాలి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు డిమాండ్
నరసాపురం: పైకి బ్రాండెడ్ లేబుళ్లు, పక్కా బ్యాచ్ నంబర్లు ఉన్న మద్యం బాటిళ్లు మూతలు తెరిస్తే నాసిరకం, నకిలీ మద్యం ప్రజల ప్రాణాలు తీ స్తున్నాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. రాష్ట్రం అంతా నారవారి వాకిట్లో తయారైన నకిలీ మద్యం ఏరులై పారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యం అరికట్టాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం నరసాపురంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి ఎకై ్సజ్ సీఐ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ముదునూరి మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవహారం బట్టబయలైనా కూటమి ప్రభుత్వం నోరుమెదపకపోవడం దారుణమన్నారు. పైగా వైఎస్సార్‌సీపీ అల్లరి చేస్తుందని కూటమి నేతలు ఎదురుదాడి చేయడం సిగ్గుచేటన్నారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. నరసాపురం పక్కనే ఉన్న పాలకొల్లులోనే మద్యం తయారీ వ్యవహారం వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. కూటమి నేతలే మద్యం సిండికేట్లుగా అవతారమెత్తి వ్యవహారాలు నడుపుతున్నారని ఆరోపించారు. వీధివీధినా బెల్ట్‌షాపులు వెలిసినా ఎకై ్సజ్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలకు మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకునేవారే లేరన్నారు. నకిలీ మద్యం నివారణ, ఎమ్మార్పీ ధరలకు విక్రయాలు, బెల్ట్‌షాపులు అరికట్టేందుకు వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. ఎకై ్సజ్ సీఐ రాంబాబుకు వినిపత్రం అందించారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి ఎకై ్సజ్ కార్యాలయం వరకూ ర్యాలీ సాగింది. మున్సిపల్ చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, వైస్ చైర్‌పర్సన్ కామన నాగిని, పార్టీ సీఈసీ సభ్యుడు పీడీ రాజు, పెండ్ర వీరన్న, జెడ్పీటీసీలు బొక్కా రా ధాకృష్ణ, తిరుమాని బాపూజీ, ఎంపీపీ మైలాబత్తుల సోనీ తదితరులు పాల్గొన్నారు.
భారీ ర్యాలీ నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు, పార్టీ నాయకులు
నరసాపురంలో మహిళా నేతలతో కలిసి ఎకై ్సజ్ సీఐకు వినతిపత్రం ఇస్తున్న దృశ్యం

రాష్ట్రంలో ఏరులై పారుతున్న నకిలీ మద్యం