ఉద్యోగ భద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భద్రత కల్పించాలి

Oct 17 2025 7:55 AM | Updated on Oct 17 2025 7:55 AM

ఉద్యో

ఉద్యోగ భద్రత కల్పించాలి

ఉద్యోగ భద్రత కల్పించాలి సీఐఐఏ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి కల్తీ మద్యం కేసులో సిట్‌ దర్యాప్తు

భీమవరం: పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలు అమలు చేయాలని పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలియజేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సంఘ అధ్యక్ష, కార్యదర్శులు శివరామ్‌, రాజారెడ్డి మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల సమస్యలు వినే నాథుడే కరువయ్యాడన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేధింపులు పెరిగాయని, వేతన బకాయిలు, పని ఒత్తిడి బాగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. టెండర్‌ తో నిమిత్తం లేకుండా ఉద్యోగాలు కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా టెండర్ల పేరుతో డబ్బులు వసూలు చేయడం మానుకోలేదని ఆరోపించారు. యూనియన్‌ గౌరవ అ ధ్యక్షుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ వంటి పేర్లు పెట్టి ప్రజాప్రతినిధులు ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప పరిశుభ్రతను కాపాడే వారి పరిస్థితిని పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం కొత్తగా చెబుతున్న స్వర్ణ పంచాయతీల్లో సీనియార్టీని బట్టి పంచాయతీ కార్మికులకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సంఘ నాయకులు కిరణ్‌, రాజబాబు, మల్లుల ఏసుబాబు, శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో ఉప్పునీటి సాంద్రత కలిగిన ప్రాంతంలో ఆక్వా సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా సీఐఐఏ రిజిస్ట్రే షన్‌ చేయించుకోవాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లో రిజిస్ట్రేషన్‌పై సమీక్షించారు. దేశంలోనే పశ్చిమగోదావరి జిల్లాను ఎంపిక చేసి బ్రాకిష్‌ వాటర్‌ క్లస్టర్‌ కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. దీనివలన కేంద్ర ప్రభుత్వం సీఐఐఏఎ కింద మంజూరు చేసే ప్రయోజనాలను పొందడానికి వీలవుతుందని తెలిపారు. జిల్లా లో 17,100 ఎకరాలు బ్రాకిష్‌ వాటర్‌ ఆక్వా సాగులో ఉందని, ఈ పరిధిలో రైతులు నెలాఖరులోపు రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసుకోవాలన్నారు. మొగల్తూరు మండలంలో ఐదు, నరసాపురం మండలంలో ఆరు, యలమంచిలి, భీమవరం మండలాల్లో రెండేసి చొప్పున రెవెన్యూ గ్రా మాలు ఈ పరిధిలో ఉన్నాయన్నారు. సముద్ర తీరానికి రెండు కిలోమీటర్లు, ఉప్పునీటి సాగు కాలువలకు రెండు వందల మీటర్ల దూ రంలో సాగు చేసేవి మాత్రమే బ్రాకిష్‌ వాటర్‌ సాగు పరిధిలోకి వస్తాయన్నారు. జిల్లాలో ఫ్రెష్‌ వా టర్‌ కింద 1,32,503.91 ఎకరాల్లో ఆక్వా సాగు విస్తీర్ణం ఉందని, ఇప్పటివరకు 56,881.8 ఎకరాల విస్తీర్ణంలోని రైతులు అప్సడా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్నారన్నారు. మిగిలిన వారూ పూ ర్తిచేసుకోవాలన్నారు. డీఆర్వో బి.శివ న్నారాయ ణ రెడ్డి, మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ అయ్యా నాగరాజా, ఏడీ ప్రసాద్‌, నైపుణ్యాభివృద్ధి అధికారి లోకమాన్‌, రైతులు పాల్గొన్నారు.

ఏలూరు టౌన్‌: రాష్ట్రంలో సంచలనంగా మారిన కల్తీ మద్యం వ్యవహారంలో సిట్‌ అధికారులు ఏలూరులోని ఒక మద్యం వ్యాపారిని విచారించారు. కల్తీ మద్యం కుంభకోణంలో కీలక పా త్రధారి జనార్దన్‌కు ఏలూరులోని వ్యక్తికి మద్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏలూరుకు చెందిన వ్యక్తిని విచారించినట్టు సిట్‌ అధికారులు చెబుతున్నారు. గ తంలో ఇద్దరి మద్య జరిగిన వ్యాపార లావాదేవీల్లో భాగంగానే డబ్బులు ఇచ్చినట్లు, ప్ర స్తుతం అలాంటి ఆర్థిక లావాదేవీలేమీ జరగలేదని అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.

ఉద్యోగ భద్రత కల్పించాలి 1
1/1

ఉద్యోగ భద్రత కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement