
స్వచ్ఛ బురిడీ
న్యూస్‌రీల్
పార్సిల్ వాహనాల్లో బాణసంచా తరలింపు నేరం
1
2
● ఉదయం 9.20లోపు విద్యార్థుల హాజరు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఆయా అటెండెన్స్, ఐఎంఎంఎస్ యాప్‌లో ఇన్స్‌పెక్షన్ రిపోర్టు పూర్తి చేయడం, మధ్యాహ్నం 12 గంటలలోపు భోజన పథకానికి సంబంధించిన మెనూ లైవ్, ఫొటోలు, వీడియోలు పంపాలి.
● 2 గంటలలోపు మొక్కల రిజిస్ట్రేషన్ నమోదు.
● సాయంత్రం విట్‌నెస్ యాప్ అప్‌డేట్ చేయాలి.
● ఆపై టీఎంఎఫ్, లీప్ యాప్, ఎఫ్‌ఎల్‌ఎన్, టీపీడీఎస్, మైస్కూల్, డిజిటల్ అటెండెన్స్, లాంగ్వేజ్ మాపింగ్‌లు వంటి పనులు చేయాలి.
● ఇలా క్లాస్‌రూమ్‌లో సమయం బోధనకు కాకుండా స్కీన్‌లపై స్వైపింగ్ చేయడానికే ఖర్చవుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
శురకవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
భీమవరం (ప్రకాశంచౌక్): 2027 గోదావరి పుష్కరాలకు శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి బడ్జెట్ రూపకల్పనపై ఆయా శాఖల అధికారులతో జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి గురువారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. అభివృద్ధి పనులకు బడ్జెట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో గోదావరి నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి పనుల నిర్వహణకు కన్జర్వెన్సీ శాఖలకు గుర్తించిన 42 పుష్కర ఘాట్లకు మరమ్మతులు, అప్రోచ్ రోడ్లు, లైటింగ్, తాగునీరు, శానిటేషన్, మరుగుదొడ్లు, ఆలయాల మరమ్మతులు, మున్సిపాలిటీల్లో బీటీ రోడ్లు, డ్రెయిన్లు, ఏటుగట్టు సుందరీకరణ, నరసాపురం, పాలకొల్లు పట్ట ణంలో వసతి గృహాల మరమ్మతులు, స్వాగత ద్వారాలు, జనరేటర్లు, మెడికల్ క్యాంపులు తదితర వాటిపై సూచనలు ఇచ్చారు. డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, డీపీఓ రామ్‌నాథ్‌రెడ్డి, టూరిజం అధికారి ఏవీ అప్పారావు, జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఉషారాణి, జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి కె.శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఎ.శ్రీనివాసరావు, నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్య పాల్గొన్నారు.
భీమవరం: ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమం చేపట్టిందని, దేశవ్యాప్తంగా 5 కోట్ల మందితో సంతకాల సేకరణ లక్ష్యమని ఏపీ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో నియోజకవర్గంలో సుమారు 16 వేల సంతకాల సేకరణ చేపడతున్నామన్నారు. బీజేపీ ప్రజల ఓట్లను దోచుకుని మూడోసారి గద్దెనెక్కిందని, ఓటర్ల జాబితాలో పలు అవకతవకలకు పాల్పడ్డారని, బీజేపీ ఓటు చోరీకి పాల్పడిందని విమర్శించారు. త్వరలో జరగనున్న బిహార్ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడిపోవడం ఖాయమన్నారు. ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పాలక్ వర్మ, మాజీ ఎంపీ కనుమూరు బాపిరాజు, నరసాపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కేబీఆర్ నాయుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పాతపాటి హరికుమార్‌రాజు, జిల్లా ఇన్‌చార్జ్ బైపూడి నాగేశ్వరావు పాల్గొన్నారు.
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీ ‘ప్రజ్ఞ’ పేరిట మాసపత్రికను ప్రారంభించింది. తొలి సంచికను ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, నూజివీడు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ గురువారం ఆవిష్కరించారు. విద్యా ర్థుల చైతన్యం, ప్రతిభ, నూతన ఆవిష్కరణలను ఇందులో ప్రతి నెలా ప్రచురించనున్నట్టు తెలిపారు. ఐఐటీలలో ఇలాంటి మాసపత్రికలు ప్రచురితమవుతాయని, అలాంటి సంప్రదాయాన్ని ట్రిపుల్‌ఐటీలో కూడా పరిచయం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇంజినీరింగ్ విద్యార్థులే తమ పరిజ్ఞానంతో ఈ మాసపత్రికకు అంకురార్పణ చేసుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. సెంట్రల్ డీన్ శ్రావణి, ఈఐటీపీ డీన్ శ్యాం, పాలనాధికారి లక్ష్మణరావు, అకడమిక్ డీన్ సాదు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలో 409 పంచాయతీలు, ఐదు పట్టణాలు, ఒక నగర పంచాయతీ ఉన్నాయి. 70 శాతం గ్రామాలను డంపింగ్‌యార్డు సమస్య పీడిస్తోంది. చెత్త నుంచి సంపద తయారీకి గతంలోనే బృందావనాలు నిర్మించినా వినియోగానికి నోచుకోవడం లేదు. అక్టోబర్ 2 తర్వాత నుంచి రాష్ట్రం అంతటా ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్టు ఏడు నెలల క్రితం తణుకు పర్యటనలో ప్రకటించిన సీఎం చంద్రబాబు ఆ దిశగా ఇంకా కార్యాచరణ చేసిన దాఖలాలు లేవు.
నిధులేవీ ?
ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్)తో ప్రజాభిప్రాయ సేకరణ అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం అందుకు అవసరమైన సిబ్బంది నియామకానికి, సా మగ్రి కొనుగోలుకు నిధులివ్వడం లేదని పంచా యతీ సిబ్బంది వాపోతున్నారు. ఇంటింటా చెత్త సేకరణ కోసం 250 కుటుంబాలకు ఒక గ్రీన్ అంబాసిడర్‌ను నియమించాల్సి ఉండగా కొన్నిచోట్ల సగం మంది కూడా లేని పరిస్థితి. నెలకు రూ.10 వేలు జీతంపై గ్రీన్ అంబాసిడర్‌ను నియామకం చేసు కోవాలని ప్రభుత్వం చెబుతుండగా, ఆదాయం లేక సిబ్బంది నియామకం చేసుకోలేని పంచాయతీలు ఎన్నో ఉన్నాయంటున్నారు.
ఏదీ స్వచ్ఛత.. ఎక్కడ సంపద
సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపంతో చెత్త నుంచి సంపద సృష్టి ప్రకటనలకే పరిమితమవుతోంది. చాలా పంచాయతీల్లో సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. డంపింగ్ యార్డులు లేకపోవడం, బృందావనాలు వినియోగానికి నోచుకోక గ్రామాల్లో సేకరించిన చెత్తను కాలువగట్లు, రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్కడే డంప్ చేస్తున్నారు. గట్లపై వేసిన చెత్త కాలువల్లోకి చేరి నీటి కాలుష్యంతో పాటు పూడుకు పోయి సాగు, మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. రోడ్ల్ల పక్కన చెత్తకుప్పలతో రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు అగచాట్లు పడాల్సి వస్తోంది. కొన్ని పంచాయతీల్లో రోడ్ల పక్కన వేసిన చెత్త కనిపించుకుండా గ్రీన్ మ్యాట్‌లు కట్టి కవర్ చేస్తున్నా దుర్గంధం షరా మామూలే అవుతోంది.
మరమ్మతులు మూన్నాళ్ల ముచ్చటే
జిల్లాలో కూటమి ప్రభుత్వం రూ.42.57 కోట్లతో చేపట్టిన మరమ్మతులు మూన్నాళ్ల ముచ్చటే అ య్యాయి. పల్లె పండగగా ఉపాధి హామీ నిధులు రూ.46.48 కోట్లతో అంతర్గత రహదారుల పనులు కూటమి నేతలు కావాల్సిన చోట్ల పెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వలంటీర్ల జాడలేదు. కొత్త పింఛన్ల మంజూరు లేదు. గృహనిర్మాణాలు ముందుకు సాగడంలేదు. రైతులకు ఎరువులు అందించలేని పరిస్థితి. పాలన వ్యవస్థలో ఎన్నో వైఫల్యాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారి దృష్టిని మరల్చేందుకే స్వచ్ఛ భారత్, ఐవీఆర్‌ఎస్ సర్వే అంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోందన్న వి మర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కోసం వేచిచూస్తున్న రోగులు
ఆగిరిపల్లి: కూటమి ప్రభుత్వం అత్యవసర సేవలందించే వైద్యులను కూడా ప్రచార ఆర్భాటానికి వాడుకుంటోంది. సూపర్ జీఎస్టీ అవగాహన కార్యక్రమాలకు వైద్యులను వినియోగించుకోవడంతో పేదలకు వైద్యసేవలు దూరమవుతున్నాయి. ఆగిరిపల్లి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండగా ఒకరు సేవ లందిస్తున్నారు. రోజూ ఆస్పత్రిలో 100 మంది వర కు ఓపీ చూపించుకుంటారు. గురువారం ఆగిరిపల్లిలో జరిగిన సూపర్ జీఎస్టీ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి హాజర య్యారు. దీంతో ఉదయం కొందరు రోగులకు పీ హెచ్‌సీలో వైద్యం అందించిన తర్వాత వైద్యాధికారి జగన్‌మోహన్‌రావు జీఎస్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. దీంతో పీహెచ్‌సీలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో రోగులు సుమారు 3 గంటల పాటు అవస్థలు పడ్డారు. డాక్టర్లను ఇలా ప్రచారానికి వాడుకోవడం ఏంటని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై డాక్టర్ జగన్‌మోహన్‌రావుని వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నట్టు చెప్పారు.
ఈనెల 7న నిర్వహించిన ధర్నాలో బోధనేతర పనులు, ఆన్‌లైన్ యాప్‌లు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బోధనేతర పనులు రద్దుపై దశల వారీగా ఆందోళనలు పెరిగేలా ఫ్యాప్టో ఆధ్వర్యంలో పోరాటానికి ఉపాధ్యాయులు సిద్ధం కావాలి.
– పుప్పాల సూర్యప్రకాశరావు,
జిల్లా ఫ్యాప్టో నాయకులు
బడుల్లోకి సెల్‌ఫోన్ ప ట్టుకుని వెళ్లకుండా కేవలం పాఠాలు మాత్రమే పిల్లలకు చెబుతాం. ఫేషియల్ హాజరు కోసం ప్రభుత్వం పరికరాలు అందించాలి. బోధనా సమయం హరించేలా ఉపాధ్యాయులకు అప్పగిస్తున్న ఆన్‌లైన్ పనులతో సింగిల్ టీచర్ స్కూళ్లలో పరిస్థితి దారుణంగా ఉంది.
– షేక్ రంగావలి, జిల్లా ఫ్యాప్టో నాయకులు
నిడమరు: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో బోధనేత పనులు చేయిస్తూ ఉపాధ్యాయ వృత్తినే కూటమి ప్రభుత్వం అవమానిస్తున్నట్లు ఉపాధ్యా య వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 7న విజయవాడలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఈనెల 10 నుంచి ప్రభుత్వ బడుల్లో బోధనేతర కార్యక్రమాలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు గురువారం జిల్లాస్థాయి అధికారులకు ఫ్యాప్టో నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. దీంతో శుక్ర వారం నుంచి అన్ని ప్రభుత్వ బడులు బోధనేతర పనులు బహిష్కరించి నిరసనలు తెలిపేలా ఉపాధ్యాయ సంఘాల నాయకులు సన్నద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం విద్యారంగ మూలాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తుందని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. వాట్సాప్‌లో అర్జెంట్, మోస్ట్ అర్జెంట్ అంటూ మెసేజ్‌లు, ఆన్‌లైన్‌లో పనులు, వెబెక్స్ మీటింగ్‌లతో రోజంతా బోధనకు దూరమవుతున్నట్టు వాపోతున్నారు.
బోధనేతన పనులతో నష్టాలు
కూటమి ప్రభుత్వంలో సర్కారీ బడులు అభ్యాస మందిరాలుగా కాకుండా డేటా సెంటర్లుగా మారు తున్నాయంటూ ఫ్యాప్టో నేతలు చెబుతున్నారు. బోధనేతర పనుల వల్ల రోజువారీ తరగతులు ఆల స్యం అవుతున్నాయి. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు సమయం తగ్గిపోతుంది. టీచర్స్‌లో బోధనాసక్తి కూడా క్రమంగా తగ్గిపోతుంది. టెక్నికల్ సమస్యలతో మానసిక ఒత్తిడిలో పడటం, నా ణ్యతగల బోధన కంటే యాప్‌ల స్క్రీన్‌షాట్‌ల ప్రా ముఖ్యతకే అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు.
పాఠశాలలు తెరిచిన నాటి నుంచీ..
ఈ ఏడాది జూన్ 12న పాఠశాల తెరిచిన నాటి నుంచి స్కూల్ ఆర్గనైజేషన్ టీములు, ఎంటీఎస్ బదిలీలు, కౌన్సెలింగ్‌లతో జూన్ నెల ముగిసింది. తర్వాత గిన్నిస్ రికార్డు పేరుతో యోగాంధ్ర ముందస్తు కార్యక్రమాలు, స్కూడెంట్ కిట్స్, పాఠ్యపుస్తకాలు తెచ్చుకుని అందించడం, బియ్యం లెక్కలు, మెగా పేరెంట్ మీటింగ్ 2.0కు పది రోజులు ముందుగా జూలై ముగిసింది. తర్వాత లీడర్‌షిప్, ప్రా థమిక అక్షరాస్యత, ఎఫ్‌ఎల్‌ఎన్ వంటి శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. నిత్యం సర్వర్ డౌన్‌తో టీచర్ ముఖ హాజరు నమోదుకు ఉదయం, సాయంత్రం ఆలస్యమవుతోంది. దీంతోపాటు విద్యాశక్తి కార్యక్రమం కొనసాగుతోంది. విద్యార్థులకు అందించే సన్నబియ్యం బస్తాలు ఓపెన్ చేసి క్యూఆర్‌కోడ్‌లు స్కానింగ్ నమోదు, ప్రతి బియ్యం బస్తా, చిక్కీలు, రాగి, బియ్యం, క్లీనింగ్ టూల్స్, ఐఎఫ్‌పీ ట్యాబ్‌లెట్స్ పంపిణీ వంటివి ఆన్‌లైన్ చేయడం, ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలైన సూపర్ జీఎస్టీ ప్రచారాన్ని ఉపాధ్యాయులపై రుద్దడం దారుణమని ఆయా సంఘాల నాయకులు అంటున్నారు. ఈనెల 13 నుంచి ఎఫ్‌ఏ–2 పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసే సమయంలో ప్రభుత్వ ప్రచారాలకు ఉపాధ్యాయులను ఉపయోగించడం ఎంత వరకూ సబబు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఆన్‌లైన్ వర్కులు బహిష్కరిస్తున్నట్టు జిల్లా అధికారులకు వినతిపత్రం అందిస్తున్న ఫ్యాప్టో నేతలు
ఉండి మండలం వాండ్రం గ్రామంలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కనిపించిన దృశ్యాలివి. చెత్త నుంచి సంపద తయారీకి నిర్మించిన తొట్టెలు వినియోగానికి నోచుకోక పిచ్చిమొక్కలతో నిరుపయోగంగా వదిలేసి రోడ్డు పక్కనే చెత్త వేస్తున్న వైనాన్ని కళ్లకు కడుతున్నాయి. దారిన వెళ్లే ప్రజలు చెత్త నుంచి వస్తున్న దుర్గంధంతో తీవ్ర అసౌకర్యానికి
గురికావాల్సి వస్తోంది.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పార్సిల్ సర్వీస్ వాహనాల్లో బాణసంచా, పేలుడు, విస్ఫోటన పదార్థాలు, నిషేధిత హానికారక స్వభావం కలిగిన వస్తువులను తరలిస్తే చర్యలు తప్పవని ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ హెచ్చరించారు. దీపావళి పండగ దృష్ట్యా గురువారం డీటీసీ కార్యాలయంలో ఏలూరులోని పార్సిల్ సర్వీస్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మందుగుండు సామగ్రి, విస్ఫోటన ప దార్థాలు తదితర నిషేధిత వస్తువులను నిల్వ చేయడం, లారీల్లో తరలించడం నేరమని, ఉ ల్లంఘనలకు పాల్పడే పార్సిల్ సర్వీస్ సంస్థలపై క్యారేజ్ బై రోడ్ యాక్ట్ 2007, ఎంవీ యాక్ట్, సీఎంవీ రూల్స్ ప్రకారం కేసులు నమో దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం వాహన తనిఖీ అధికారులు వారికి నోటీసులు అందజేశారు. ఇన్‌చార్జి ఆర్టీఓ ఎస్‌బీ శేఖర్, వాహన తనిఖీ అధికారులు ఎండీ జమీర్, జి.స్వామి తదితరులు పాల్గొన్నారు.
తాజాగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డులు అందుకున్న ఈ రెండు స్థానిక సంస్థల్లో పరిస్థితి ఇలా ఉంటే.. అవార్డులకు ఎంపిక కాని మిగిలిన పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదేమి పారిచోద్యం
స్థానిక సంస్థల్లో పడకేసిన ప్రగతి
గ్రామీణ వ్యవస్థలు నిర్వీర్యం.. రోడ్లు అధ్వానం
క్షేత్రస్థాయిలో కనిపించని చెత్తశుద్ధి
వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే యత్నం
పారిశుద్ధ్యంపై ఐవీఆర్‌ఎస్ ఫోన్‌కాల్స్, స్వచ్ఛాంధ్ర అవార్డులు
ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణకు నిధులివ్వని సర్కారు
నిరుపయోగంగా సంపద కేంద్రాలు
జిల్లా కేంద్రం భీమవరం హౌసింగ్‌బోర్డు ఏరియాలోని ఒక వీధిలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇళ్ల చెంతనే రోడ్డుపై పారుతున్న మురుగునీరు, పక్కనే ఉన్న చెత్తకుప్పలు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల మధ్యాహ్నం వరకూ చెత్త తీయరని కొందరంటుంటే, రెండు రోజులకోసారి తీస్తుంటారని మరికొందరు అంటున్నారు. ఇండస్ట్రీయల్, టిడ్కో, బ్యాంక్ కాలనీ, హౌసింగ్‌బోర్డు తదితర ప్రాంతాల్లో డ్రెయినేజీలు పూడికతో నిండి అధ్వానంగా మారాయి. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై చెత్తాచెదారం చేరి దుర్గంధం వెదజల్లుతున్నాయి.

స్వచ్ఛ బురిడీ

స్వచ్ఛ బురిడీ

స్వచ్ఛ బురిడీ

స్వచ్ఛ బురిడీ

స్వచ్ఛ బురిడీ

స్వచ్ఛ బురిడీ

స్వచ్ఛ బురిడీ

స్వచ్ఛ బురిడీ

స్వచ్ఛ బురిడీ