
అభిమాన నేతకు నీరాజనం
న్యూస్‌రీల్
స్కూల్ బస్సులపై కేసులు
ఏలూరు జిల్లా వ్యాప్తంగా మోటారు వాహనాల తనిఖీ అధికారులు బుధవారం విద్యా సంస్థల బస్సులను తనిఖీ చేసి 18 కేసులు నమోదు చేశారు. 8లో u
భీమవరం మున్సిపాలిటీలో ఎక్కడ చెత్త అక్కడే ఉండగా.. మున్సిపాలిటీకి మాత్రం స్వచ్ఛ మున్సిపాలిటీగా అవార్డు ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 8లో u
గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
సాక్షి, భీమవరం: వివాహ వేడుక కోసం జిల్లాకు విచ్చేసిన మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జనం నీరాజనం పట్టారు. కుండపోతగా వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా కాన్వాయ్ వెంట పరుగులు పెట్టారు. అభిమాన నేతను చూసి యువత కేరింతలు కొడుతూ సంబరపడిపోయారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాలులో జరిగిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తనయుడు కృష్ణంరాజు వివాహానికి జగన్ విచ్చేశారు. ఆయన వస్తున్నారన్న విషయం తెలియడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు భీమవరం చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం కల్యాణ వేదికకు సమీపంలోని హెలీప్యాడ్‌కు 3.25 గంటలకు చేరుకుంటారనగా మధ్యాహ్నం నుంచే జువ్వలపాలెం, కన్వెన్షన్ హాలు రోడ్లలో హడావుడి మొదలైంది. మండుటెండను లెక్కచేయకుండా పార్టీ శ్రేణులు, యువత పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు పట్టుకుని సందడి చేశారు. జగన్ హెలీప్యాడ్‌కు కొద్దిసేపట్లో చేరుకుంటారనే సరికి కారుమబ్బులతో కుండపోత వర్షం మొదలైనా ఎటూ కదలకుండా వేచిచూశారు. అక్కడి నుంచి కల్యాణ వేదిక వరకు కేరింతలు కొడుతూ, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. సాయంత్రం 4 గంటల సమయానికి జగన్ కల్యాణ వేదిక వద్దకు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం 5 గంటల సమయానికి హెలీప్యాడ్ నుంచి తిరుగుపయనమయ్యే వరకూ హోరువానలోనూ అధినేత వెంటే ఉండి అభిమానాన్ని చాటుకున్నారు.
కిక్కిరిసిన కన్వెన్షన్
తొలుత హెలీప్యాడ్ వద్ద ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు జగన్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి జగన్ కన్వెన్షన్ హాలుకు బయలుదేరారు. కల్యాణ వేదిక వద్ద ప్రసాదరాజు, శారదవాణి దంపతులు జగన్‌కు స్వాగతం పలికారు. వధూవరులు కృష్ణంరాజు, దివ్యలను జగన్ ఆశ్వీరించారు. వేదిక వద్ద జగన్‌ను చూసేందుకు జనం పోటీపడ్డారు. ఆయన వధూవరులను ఆశీర్వదిస్తున్న దృశ్యాలను చిన్నాపెద్దా తేడాలేకుండా సోఫాలు, కుర్చీలు ఎక్కీ మరీ తమ సెల్‌ఫోన్లలో బంధిస్తూ మురిసిపోయారు.
భీమవరంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
హెలీప్యాడ్ నుంచి కల్యాణ మండపం వరకూ భారీ జనసందోహం
భారీ వర్షాన్ని సైతం లెక్కచేయని యువత
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి తరలివచ్చిన నేతలు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు కుమారుడి వివాహానికి హాజరు

అభిమాన నేతకు నీరాజనం

అభిమాన నేతకు నీరాజనం