
వృద్ధులను గౌరవించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): విద్యార్థులకు చిన్ననాటి నుంచే వృద్ధులను గౌరవించడం నేర్పించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. గురువారం స్థానిక బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి ఫంక్షన్ హాల్‌లో జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథి గా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వృద్ధులకు ఏ సమస్య ఉన్న జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. వయోవృద్ధుల సంక్షేమ సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తల్లిదండ్రులు, వృద్ధులు పోషణ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం పలువురు సంఘ నాయకులను కలెక్టర్ సత్కరించారు. జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ డైరెక్టర్ బి.రామ్‌కుమార్, జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అడ్డాల నాగ సూర్య సత్యనారాయణ, శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి కార్యదర్శి మెంటే పార్థసారథి, సీనియర్ సిటిజన్స్ ట్రి బ్యునల్ అధికారి దాయన సురేష్ చంద్రాజీ పాల్గొన్నారు.
దుర్గాప్రసాద్‌కు రాష్ట్రస్థాయి అవార్డు
ఇటీవల రాష్ట్రస్థాయి అవార్డు పొందిన వయోవృద్ధుల జిల్లా అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యుడు మేళం దుర్గాప్రసాద్‌ను కలెక్టర్ నాగరాణి సత్కరించారు.