
నిమజ్జనంలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం
ముదునూరి ప్రసాదరాజు,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
నరసాపురం: నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో గణేశ్ నిమజ్జనంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విచారం వ్యక్తం చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పండుగ సంబంరంలో ప్రమాదం జరిగి ప్రానాలు కోల్పోవడంపై ఆయన తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
తాడేపల్లిగూడెం: జిల్లా వాసులు కర్నూలు ఉల్లిపాయలను వినియోగిస్తూ కర్నూలు రైతులను ఆదుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. సోమవారం బ్రహ్మానందరెడ్డి మార్కె ట్‌ను సందర్శించారు. ఉల్లి అమ్మకం, కొనుగోళ్లను పరిశీలించారు. హాస్టల్స్, ప్రైవేటు కళాశాలల వంటల్లో ఈ రకం ఉల్లిపాయలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట ఆర్డీఓ కౌసర్ భానో, మార్కెటింగ్ ఏడీ సునీల్‌కుమార్ తదితరులు ఉన్నారు. కర్నూలు ఉల్లిపాయలను రైతుల నుంచి ఇక్కడి గుత్త వ్యాపారులు కిలో రూ.12 కొనుగోలు చేయాలని సాయంత్రం పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్సులో వ్యాపారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ కోరారు. కొంతకాలం మహారాష్ట్ర ఉల్లి దిగుమతులు తగ్గించుకుని, కర్నూలు ఉల్లి వినియోగం పెంచడానికి వ్యాపారులు దోహదపడాలన్నారు. కలెక్టర్ ప్రతిపాదనకు వ్యాపారులు అంగీకరించారు. మెగా మార్టుల ద్వారా కర్నూలు ఉల్లి విక్రయించే ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని సవితృపేటలో పింఛన్ల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. స్థానికంగా దాతల సహకారంతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
భీమవరం: ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అర్జీలను తీసుకున్న అనంతరం సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రజా ఫిర్యాదులు పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ అర్జీలు పునరావృతం గాకుండా నిర్ణీత గడువులోగా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. 15 ఫిర్యాదులు అందాయని తెలిపారు.
పెనుగొండ: పేదలకు ఉచితంగా అందించాల్సిన ఇసుకను ఆచంటలో టీడీపీ నాయకుడు గణపతినీడి రాంబాబు అక్రమంగా ర్యాంపుల ద్వారా తరలించి, వాటిని ప్రతి గ్రామంలో గుట్టలను నిల్వ చేసి అక్రమంగా తరలిస్తున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా చూసీ చూడనట్లు వ్యవహిస్తున్నారని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులకు వైఎస్సార్‌సీపీ నాయకులు సుంకర సీతారామ్, కోట వెంకటేశ్వరరావు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ గణపతినీడి రాంబాబు నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపుల ద్వారా అక్రమంగా ఇసుక తరలించి, అధిక రేటుకు అమ్ముతున్నారని తెలిపారు.

నిమజ్జనంలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం

నిమజ్జనంలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం