
అగ్గిపుల్లపై వైఎస్సార్ చిత్రం
పోలవరం రూరల్: గోదావరి వరద స్వల్పంగా తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి చేరే నీరు తగ్గుతుండటంతో వరద ప్రవాహం తగ్గుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 33 మీటర్లకు వరద నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 10.73 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. భద్రాచలం వద్ద 43.40 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.
ఏలూరు (టూటౌన్): ఏలూరు టాటా మ్యాజిక్ ఓనర్స్, డ్రైవర్స్ ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఆటో, టాటా మ్యాజిక్, క్యాబ్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ధర్నాని ఉద్దేశించి ఐఎఫ్‌టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే పోలారి, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం వల్ల టాటా మ్యాజిక్ సర్వీస్ ఆదాయం తీవ్రంగా దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో, టాటా మ్యాజిక్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని. నెలకు రూ.3000 పెన్షన్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.