డెలివరీ బాయ్స్‌పై వేధింపులు తగవు
భీమవరం: జిల్లాలో గ్యాస్ డెలివరీ బాయ్స్‌పై వేధింపులు ఆపకపోతే సమ్మెకు సిద్ధమని జిల్లా గ్యాస్ డెలివరీ బాయ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు హెచ్చరించారు. గురువారం భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ హాల్‌లో జరిగిన ప్రథమ మహాసభలో ఆయన మాట్లాడారు. డెలివరీ బాయ్స్‌కు కనీస వేతనాలు అమలు చేయకపోగా ఇటీవల అధికారులు, డీలర్ల వేధింపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. డీలర్స్ డెలివరీ వాహనాలకు పెట్రోల్, డీజిల్ సమకూర్చడం లేదని, కిలోమీటర్ల దూరం సిలిండర్లు సరఫరా చేసినా వినియోగదారులు కనీస చార్జీలు కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ టీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ మా ట్లాడుతూ డెలివరీ బాయ్స్ జీతాలు తక్కువగా ఉన్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి ఏఓ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.
నూతన కమిటీ ఎన్నిక : జిల్లా గ్యాస్ డెలివరీ బాయ్స్ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వై.వెంకటేశ్వరరావు, బి.వాసుదేవరావు, ఉపాధ్యక్షులుగా ఎం.సీతారామయ్య, సనపల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా సత్యనారాయణరాజు, 14 మంది స భ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
ఆక్వా సమస్యలను అధిగమిస్తాం
భీమవరం: అమెరికా ఆంక్షల కారణంగా రొయ్యల రైతులకు ఏర్పడిన ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనువైన చర్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లో జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్ సీహెచ్ నాగరాణితో కలిసి ఆయన సమీక్షించారు. అనంతరం దినకర్ విలేకరులతో మాట్లాడుతూ అమెరికా ఆంక్షల నేపథ్యంలో కొనుగోలుదారులు సిండికేట్‌గా మారి అన్నిరకాల కౌంట్ రొయ్యల ధరలు తగ్గించారనే విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకునేలా కృషిచేస్తానన్నారు. ఉపాధి హామీ పథకం, జలజీవన్ మిషన్ అమలు, గ్రామీణ సడక్ యోజన, లాక్‌పతి దీదీ, గరీబ్ కళ్యాణ్ అన్నయోజన, పీఎం సూర్యఘర్, పీఎం ఆవాస్ యోజన, పీఎం విశ్వకర్మ యోజన వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్షించామన్నారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎమ్మె ల్సీ వంక రవీంద్రనాథ్, ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సీపీఓ కె.శ్రీనివాసరావు, వ్యవసాయశా ఖ జేడీ జెడ్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
డెలివరీ బాయ్స్‌పై వేధింపులు తగవు


