
డీఈఓ శ్యామ్‌సుందర్‌కు వినతిపత్రం అందచేస్తున్న పీటీఐ నాయకులు
ద్వారకాతిరుమల: ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని చినవెంకన్నకు నిత్యం తెల్లవారుజామున గోవిందనామ ప్రచార సేవా సంఘం వ్యవస్థాపకురాలు సునీతా మధుసూదన్‌లు తులసి గజమాల (వనమాల)ను సమర్పిస్తున్నారు. గత ఎన్నిదేళ్లుగా ఈ సేవను కొనసాగిస్తున్నారు. హిందూధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవారి ఆలయంతో పాటు ఈ ధనుర్మాసంలో ప్రముఖ వైష్ణవ ఆలయాలైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి, పెద్ద తిరుపతి గోవిందరాజ స్వామికి, మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామికి ఈ తులసి గజమాలలను అందిస్తున్నారు. విజయవాడలోని భవానీపురానికి చెందిన సునీతా మధుసూదన్‌లు అక్కడున్న 10 ఎకరాల తోటలోని తులసిని సేకరించి, సేవకుల ద్వారా వాటిని గజమాలలుగా మలచి వైష్ణవాలయాలకు అందజేస్తున్నారు.
విద్యార్థులకు కలెక్టర్ అభినందన
ఏలూరు(మెట్రో) : రాష్ట్ర స్థాయి సైన్సు ఎగ్జిబిషన్‌లో ప్రథమ బహుమతి పొంది జాతీయ స్థాయి సైన్సు ఎగ్జిబిషన్‌కు ఎంపికై న చింతలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అభినందించారు. స్థానిక కలెక్టరేట్‌లో సంబంధిత విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి పొందడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి శ్యామ్ సుందర్, జిల్లా సైన్సు అధికారి చౌదరి తదితరులు పాల్గొన్నారు.
నేడు పోలీస్ స్పందన రద్దు
భీమవరం: నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి పోలీస్ స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు ఎస్పీ యు.రవిప్రకాష్ ఆదివారం తెలిపారు. స్పందనకు వచ్చే అర్జీదారులు గమనించాలని కోరారు.
జనవరిలో టీఎల్‌ఎం మేళా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రాతిపదికన ఆర్ట్, క్రాఫ్ట్ టీఎల్‌ఎం మేళాను జనవరిలో నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి పి.శ్యామ్ సుందర్ తెలిపారు. ఏలూరు జిల్లా పార్ట్‌టైమ్ ఇనస్ట్రక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక డీఈఓ కార్యాలయంలో శ్యామ్‌సుందర్‌ను కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ ఏలూరు జిల్లా అధ్యక్షుడు జీఎస్‌సీ బోస్, కన్వీనర్ నక్కా రజనీకాంత్ మాట్లాడుతూ జిల్లాలో అనేక మంది పీటీఐలకు నెలవారీ గౌరవ వేతనాలకు సంబంధించిన బిల్లులను ప్రతినెలా మండల విద్యాశాఖాధికారికి ఇవ్వడానికి ఇబ్బందులకు గురిచేస్తున్నారని డీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. మహిళా ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవులు సాధ్యమైనంత త్వరలో అమలు చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన శ్యామ్ సుందర్ పీటీఐల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
విద్యుత్ ఈఈగా వెంకటేశ్వర రావు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు సర్కిల్ పరిధిలో ఏలూరు క్వాలిటీ కంట్రోల్ –4 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా టీ.వెంకటేశ్వర రావును బదిలీ చేస్తూ ఆ సంస్థ చైర్మన్ ఇమ్మడి పృథ్వితేజ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నంలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో పర్చేజెస్ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న వీ.సత్య సాయిబాబాకు పదోన్నతి కల్పించి విశాఖపట్నంలో టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా నియమించారు.

తులసి గజమాలను తీసుకొచ్చిన గోవిందనామ ప్రచార సేవా సంఘం వ్యవస్థాపకురాలు

విద్యార్థులను అభినందిస్తున్న కలెక్టర్