పరిశీలిస్తున్న జడ్జి మంగతాయారు
సాక్షి, భీమవరం: జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్వో కె.కృష్ణవేణి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం పరీక్షల నిర్వహణపై అధికారులతో ఆమె సమీక్షించారు. పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చూడాలన్నారు. వచ్చేనెల 3 నుంచి 17 వరకు పరీక్షలు జరుగుతాయని, సీసీ టీవీల పర్యవేక్షణ ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఆరోగ్య శిబిరంతో పాటు తాగునీటి సౌకర్యాం కల్పించాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. జిల్లాలో ఇంటర్మీడియెట్‌కు 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేయగా 2,135 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. 9 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 9 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, 111 మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశామన్నారు. పదో తరగతి పరీక్షలకు 846 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, 5 కేంద్రాలు, 4 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. డీఆఓ ఆర్.వెంకటరమణ, ఏఎస్పీ ఏవీ సుబ్బరాజు పాల్గొన్నారు.
మే 1 నుంచి వేసవి క్రీడా శిబిరాలు
సాక్షి, భీమవరం: జిల్లాలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి వేసవి శిక్షణ శిబిరాలను వివిధ క్రీడాంశాల్లో నిర్వహించనున్నట్టు క్రీడా ప్రాధికార సంస్థ సీఈఓ ఎండీ మెహర్‌రాజు, చీఫ్‌కోచ్ పి.సురేంద్రబాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 50 క్రీడా శిబిరాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తామని పేర్కొ న్నారు. శిబిరాలు నిర్వహించడానికి ఆసక్తిగల క్రీడా సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు, సీనియర్ క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు సెల్ 99082 67811లో సంప్రదించాలని కోరారు. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో విజేతలు, శిక్షకులకు నగదు పురస్కారాలు అందిస్తామని, వీటి కోసం వచ్చేనెల 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వసతి గృహ తనిఖీ
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహాన్ని స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మెజి స్ట్రేట్ డి.మంగతాయారు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్‌ను ఆమె పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు సూచించారు. మెనూ బోర్డును పరిశీలించి అమలు తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
97 శాతం విద్యార్థుల హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా మంగళవారం ఇంటర్ ఫస్టియర్ కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు 34,303 మంది విద్యార్థులకు 33,752 మంది హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో 52 కేంద్రాల్లో 15,754 మంది జనరల్ విద్యార్థులకు 15,176 మంది, 1,073 మంది ఒకేషనల్ విద్యార్థులకు 916 మంది హాజరయ్యారు. ఏలూరు జిల్లాలో 39 కేంద్రాల్లో 11,452 మంది జనరల్ విద్యార్థులకు 10,929 మంది, 1,179 మంది ఒకేషనల్ విద్యార్థులకు 879 మంది హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో 4,113 మంది జన రల్, 435 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా 97 శాతం హాజరు నమో దైంది. పాలకొల్లు బాలి కల జూనియర్ కళాశాలలో పరీక్ష రాస్తున్న శ్రీ చైతన్య కళాశాల (పాలకొల్లు) విద్యార్థి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడు తూ పట్టుబడ్డాడని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.చంద్రశేఖరబాబు తెలిపారు.


