సాక్షి, వరంగల్: జీడబ్ల్యూఎంసీ జారీ చేస్తున్న లేఅవుట్ రెగ్యులేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ఫైనల్ ప్రొసీడింగ్స్ కాపీలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. 2015లో మాదిరిగా ఫైనల్ ప్రొసీడింగ్ ఉత్తర్వుల్లో రిజిస్టర్ డాక్యుమెంట్ నంబర్, సైట్ ప్లానన్, టోపో డిటెయిల్స్, మాస్టర్ప్లాన్్, ఎక్స్ట్రాక్ట్, లొకేషనన్ స్కెచ్, గూగుల్ మ్యాప్, నక్ష, సర్వేయర్ రూపొందించిన ప్లాన్న్.. 2026లో జారీ చేస్తున్న 2020 ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ కాపీల్లో లేకపోవడం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం సర్వే నంబర్, ప్లాట్ నంబర్, విస్తీర్ణంతో పాటు చార్జీలు మాత్రమే ఉండడం ప్లాట్ల యజమానులను కలవరపెడుతుండగా.. మరికొందరికి ప్లాట్ నంబర్ లేకుండానే ఓపెన్ ప్లాట్లతో రిజిస్టరైన ప్లాట్లకు ఓపెన్ ప్లాట్ పేరు మీదనే ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడనుంది. ఎందుకంటే నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని పలు వెంచర్లలో ప్లాట్ల నంబర్లు లేకుండా చాలా వరకు ఓపెన్ ప్లాట్లు సమాన పరిమాణంలో ఉండడమే ఆందోళనకు కారణం. ఉదాహరణకు వెంచర్లో సేమ్ సర్వే నంబర్, సేమ్ పరిమాణంలో ప్లాట్లు పదుల సంఖ్యలో ఉండడంతో ఒకటి రెండింటికీ మాత్రమే ఓపెన్ ప్లాట్ పేరుతో ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ తీసుకొని వాటితోనే అన్ని ప్లాట్లు విక్రయించే అవకాశం ఉంది. దీంతో కొన్ని సందర్భాల్లో కొనుగోలుదారులు, అవి నిజమని నమ్మి ఇంటి నిర్మాణ సమయంలో అధికారులు చార్జీలు తగ్గిస్తే ఇటు ఎల్ఆర్ఎస్ ఫీజు, అటు భవన నిర్మాణ చార్జీల రూపంలో ఆదాయం కోల్పోతుంది. వీటితో విలేజ్ నంబర్లు, మండలాలు సరిగా ఆన్లైన్లో తీసుకొని సమయంలో ఏదో ఒకటి పెట్టి దరఖాస్తు చేసినా అలాంటివి అధికారులు కరెక్షన్ చేయకుండానే యథావిధిగా ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎక్కడా ఎవరెవరికీ నష్టం కలుగుతుందంటే...
నగర శివార్లలోని స్తంభంపల్లి, మామునూరు, ఖిలా వరంగల్, ఆరెపల్లి, దేశాయిపేట, మడికొండ వివిధ ప్రాంతాల్లో చాలా చోట్ల కొన్ని వెంచర్లలో ప్లాట్ నంబర్లు లేకుండానే ఓపెన్ ప్లాట్లతో రిజిస్టరై ఉన్నట్టుగా తెలిసింది. ఉదాహరణకు ఒక వెంచర్లో 200 గజా ల ప్లాట్లు 20, 250 గజాలవి మరో 30 ప్లాట్లు ఉన్నాయనుకుందాం. కొన్ని వెంచర్లలో ప్లాట్ నంబర్లు స రిగా లేకపోవచ్చు. మరికొన్ని చోట్ల వాస్తవ భూ మిపై వేసిన ప్లాటింగ్, పాత లేఅవుట్ కాపీలో ఉన్న ప్లాటింగ్ మధ్య తేడాలు ఉండే అవకాశం ఉంది. ఇ లాంటి పరిస్థితుల్లో ఒక ప్లాట్‌కు జారీ అయిన కాపీ ని అదే విస్తీర్ణంలోని మరో ప్లాట్‌కు అన్వయిస్తూ చూపించే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది.
● కొనుగోలుదారుడికి : ఎల్ఆర్ఎస్ అయిందనే నమ్మకంతో డబ్బులు చెల్లించిన తర్వాత చూపించిన ప్లాట్ అదే క్రమబద్ధీకరించిన ప్లాట్ కాదని తేలితే వివాదం ఏర్పడవచ్చు.
● అసలు ప్లాట్ యజమానికి: తన ప్రొసీడింగ్‌ను మరొక ప్లాట్ లావాదేవీలో ఉపయోగించారనే వివాదం తలెత్తవచ్చు.
● ప్రభుత్వానికి: ఆమోదం పొందని మరో ప్లాట్‌ను క్రమబద్ధీకరించినదిగా చూపించి లావాదేవీ జరిగితే, ఆ ప్లాట్ ఎల్ఆర్ఎస్ చార్జీలు ప్రభుత్వానికి రాకపోయే అవకాశం ఉంటుంది. భవన నిర్మాణ సమయంలోనూ ఎల్ఆర్ఎస్ కాపీ జతచేయడం వల్ల చార్జీలు తగ్గే అవకాశముంది. ఇలా రెండు రకాలుగా సర్కారుకు నష్టం వాట్లినుంది. బ్యాంకులు కూడా భూడాక్యుమెంట్లతో పాటు ఈ ఎల్ఆర్ఎస్ కాపీని నమ్మి రుణాలు ఇచ్చే అవకాశముంది.
రిజిస్టర్ డాక్యుమెంట్ నంబర్
లేకుండానే ప్రొసీడింగ్ కాపీలు
సర్వే నంబర్, ప్లాట్ నంబర్.. కొన్ని చోట్ల ‘ఓపెన్్ ప్లాట్’ గానే వివరాలు
ఒక ప్లాట్ ఎల్ఆర్ఎస్ కాపీని
మరో ప్లాట్‌కు చూపించే అవకాశం
కొనుగోలుదారులకు చిక్కులు..
ప్రభుత్వ ఆదాయానికి గండి
ప్లాట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండాల్సిందే...
గ్రేటర్ పరిధిలో ఎల్ఆర్ఎస్కు 1.06 లక్షల దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు 18,526 దరఖాస్తులకు ఫైనల్ ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి. వీటి ద్వారా బల్దియాకు సుమారు రూ.151 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం, వేలాది ప్లాట్ల హక్కులు ముడిపడి ఉన్న ప్రక్రియలో ఫైనల్ ప్రొసీడింగ్ రూపకల్పనలోనే ప్లాట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న వాదన వినిపిస్తోంది.


