పరకాల : బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికుల హక్కులను కాలరాసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పరకాల ఆర్టీసీ డిపోలో టీడబ్ల్యూయూ–ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్య కూటమి అభ్యర్థుల తరఫున ప్రకాశ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఐక్య కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆర్టీసీ కార్మికులను కోరారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న ఐక్య కూటమి అభ్యర్థులకు ప్రతి కార్మికుడు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా పనిచేస్తోందన్నారు. పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్, కాంగ్రెస్ పట్టణ నాయకులు, ఐక్య కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి


